దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు బుల్లి తెరపై తిరుగులేని యాంకర్ గా వెలుగొందుతున్న సుమ కనకాల అచ్చమైన తెలుగు మహిళలా కనిపించడమే కాకుండా తన సమయస్ఫూర్తితో పంచ్ లు పేలుస్తూ టాప్ యాంకర్ స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తోంది. వేరే రాష్ట్రానికి చెందిన సుమా లాగా తెలుగు వారు కూడా అంతా చక్కగా యాంకరింగ్ చేయలేరు. అందుకే ఈ యాంకర్ కు మహిళల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అందుకే ఏ షో లో యాంకరింగ్ అయినా…. ప్రీ-రిలీజ్ ఈవెంట్ అయినా అందరికీ ఫస్ట్ ఛాయిస్ సుమ నే. ఇదిలా ఉండగా ఆమె నడిపిస్తున్న ఒక షో లో రొమాన్స్ శృతిమించింది. తాజాగా దానికి హాజరైన జంటలు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. దీంతో సుమ చీర అడ్డుపెట్టుకుని మరీ సిగ్గు పడిపోయింది. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే…
సక్సెస్ ఫుల్ ‘క్యాష్’ షో లో ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. సమంత లాంటి పెద్ద పెద్ద హీరోయిన్ ల నుండి యూట్యూబ్ సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొనే అవకాశం దక్కింది. తాజాగా విడుదలైన ఒక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో లో వచ్చిన నాలుగు యువజంటలు మధ్య రొమాన్స్ కొద్దిగా ఎక్కువైనట్లు ప్రేక్షకులకు అనిపించింది. మామూలుగా సుమ యాంకరింగ్ లో ఎటువంటి దోషాలను చూడలేము.
ఇక వారు చేస్తున్న పనులకు సిగ్గుతో తలదించుకొని తన చీర అడ్డం పెట్టుకున్నారు సుమ. ఏదేమైనా ‘క్యాష్’ ప్రోగ్రాం లో ఈ మధ్య ఆడిస్తున్న ‘బాస్కెట్ బాల్ గేమ్’ బాగా క్లిక్ అయింది. అయితే ఇటువంటి గేమ్ లు పెట్టడం వలన వచ్చేది కొంతమంది భార్యాభర్తలే కాబట్టి వారు తమ ప్రేమను నిలుపుకోలేక ఇలా పబ్లిక్ లో ప్రదర్శిస్తున్నారు. ఇది జనాలు కూడా భార్యా భర్తలు అన్న తర్వాత ఇంతే కదా అని లైట్ తీసుకున్నారు.