యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా అమ్మాయి సీరియల్ తో కెరీర్ ప్రారంభించి యాంకర్ గా స్థిరపడ్డ సుమ కనకాల బుల్లితెర స్టార్ అయ్యింది. తన మాటలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇప్పటికి తన అందంతో అభినయంతో స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
ఎందుకు అలా అనుకుంటున్నారా? అదేనండి.. ఇన్నాళ్లు అందంగా కనిపించి మాటలతో అందరి మనసు దోచిన సుమ కనకాల ఇప్పుడు మేకప్ లేకుండా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ఆ ఫోటోను ఎవరు షేర్ చేశారో తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. ఎవరు అనుకుంటున్నారా? సుమ కనకాలనే ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఆ ఫోటో చుసిన నెటిజన్లు అంత షాక్ అవుతున్నారు.. ఇక్కడ ఉన్నది నిజంగా సుమనేనా అని. అయితే గతంలో కూడా కొన్ని ఫోటోలు, వీడియోలను సుమ కనకాల మేకప్ లేకుండానే షేర్ చేసినప్పటికి ఈ ఫోటోలో సుమ మరి గుర్తుపట్టలేనంత ఉండిపోవడంతో అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాగా గతంలో సుమ కనకాల.. రాజీవ్ కనకాల విడిపోయారని వార్తలు భారీస్థాయిలో వచ్చాయ్. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజంలేదని సుమ కనకాల ఒక ప్రోగ్రాం ద్వారా తెలిపారు. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను వారి సోషల్ అకౌంట్స్ లో షేర్ చేస్తూ వారి మధ్య ఉన్న ప్రేమ ఎంత బలమైనదో చెబుతున్నారు.