Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆనీ మాస్టర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఏకైక లేడీ కొరియోగ్రాఫర్ గా సత్తా చాటుతున్న ఆనీ … వయసులో పెద్దవారు అయినా గాని చాలా వారాలపాటు హౌస్ లో రాణించడం జరిగింది. సాధారణంగా తెలుగు బిగ్ బాస్ షోలో ఎక్కువ వయస్సు కలిగిన కంటెస్టెంట్ లను ముందుగానే ఆడియన్స్ బయటకు పంపించేస్తారు. కానీ ఆనీ మాస్టర్ విషయంలో రివర్స్ జరిగింది. విషయంలోకి వెళితే దాదాపు పది వారాల పాటు ఆనీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో రాణించారు. అయితే హౌస్ లో ఉన్నంత కాలం ఆనీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఇంకా అనేక విషయాల పరంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఏదైనా కుండ బద్దలు కొట్టే విధంగా ఉండేది.
ఫ్రెండ్షిప్ పరంగా యాంకర్ రవి, సింగర్ శ్రీరామ్ చంద్ర మరి కొంతమంది కంటెస్టెంట్ లతో కనెక్ట్ అయింది. అయితే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ లు లోన్న ఎన్ని గొడవలు జరిగిన బయట మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు. పార్టీలతో స్టెప్పులు వేస్తూ అదిరిపోయే ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇటీవల రవి శ్రీ రామ్ చంద్ర చేసిన పనికి ఆనీ మాస్టర్ బాగా హర్ట్ అవ్వటం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళ్తే రీల్ వీడియోలు చేయడంలో ఆనీ మాస్టర్ ముందుంటుంది. అయితే ఇటీవల ఆమె కరోనా బారిన పడటంతో సెల్ఫ్ క్వరైన్ టైన్ ఉంది.
ఈ క్రమంలో లహరి, రవి, శ్రీ రామ్ చంద్ర కలిసి ఓ రీల్ వీడియో చేయడంతో ఆ వీడియోలో తాను లేకపోవడంతో ఆనీ మాస్టర్ బాగా హర్ట్ అవ్వటం జరిగిందట. అంతమాత్రమే కాకుండా ఈ విషయంలో రవిని నిందించింది. నువ్ నాతో రీల్ వీడియో చేయలేదు అని హర్ట్ అయినట్టుగా ఓ కామెంట్ పెట్టేసింది. దానికి రవి స్పందించాడు. కచ్చితంగా చేస్తాను.. ఇక చాలు అనేంత వరకు చేస్తాను అని కామెంట్ పెట్టేశాడు. దీంతో ఆనీ మాస్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.