Anil Ravipudi: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో వరుస విజయాలను అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మల్టీస్టారర్ ట్రెండ్ ను అలాగే కొనసాగించనున్నారని టాక్.. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్ 2 సినిమా తీసి భారీ హిట్ కొట్టేశారు.. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ గా ఎఫ్3 సినిమా ను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే.. మరో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం..
గత సంవత్సరం నుండి అనిల్ రావిపూడి – బాలయ్య కాంబినేషన్ లో ఓ సినిమా రానుందని ప్రచారం జోరుగా సాగుతోంది.. అనిల్ రావిపూడి బాలయ్య మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండేలా ఒక కథ రెడీ చేసినట్లు సమచారం.. ఇటీవలే అనీల్ బాలయ్య కు కథ చెప్పారని.. బాలయ్య కూడా ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. అయితే ఆ కథలో కొన్ని మార్పులు చేయమని సూచించారని టాక్.. మళ్లీ మార్పులు చేయాలంటే కొంత టైం పడుతుంది అని కొన్నాళ్ళు ఆ కథను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యాడట అనిల్ రావిపూడి..
హీరో రవితేజ, రామ్ పోతినేని తో కూడా మరో మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి కోసం అని బాలకృష్ణ ప్రాజెక్టును సైడ్ కు పెట్టినట్లు సమాచారం. రవితేజ , రామ్ కోసం సెట్ చేసిన కథ రెడీ గా ఉండటంతో ముందు ఆ సినిమాను పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్ మరి.. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.