Anil Ravipudi: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ లేని దర్శకులలో ఒకరు అనిల్ రావిపూడి. ఇప్పటివరకు అనిల్ రావిపూడి తెరకెక్కించిన అన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించడమే కాక సినిమా చూసే ప్రేక్షకుడికి కడుపుబ్బా నవ్వించాయి. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో కామెడీ యాంగిల్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం జరిగింది.
ప్రస్తుతం “ఎఫ్ 3” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాత నందమూరి బాలయ్య బాబు తో ప్రాజెక్టు ఒప్పుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా అనిల్ రావిపూడి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Anil Ravipudi: ఆ హీరోల కోసం బాలయ్య ప్రాజెక్టును పక్కన పెట్టిన అనిల్ రావిపూడి..!?
ఈ విషయాన్ని ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి చెప్పినట్లు త్వరలోనే అనిల్ రావిపూడి .. పవన్ కి స్టోరీ వినిపించడానికి రెడీ అవుతున్నట్లు ఇది మొత్తం కామెడీ తరహాలో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తూ మరోపక్క రానా మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. ఈ రెండు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి గత ఓకే అయితే .. ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కించడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?