ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ రియాల్టీ షో పై ఏపీ హైకోర్టు సీరియస్..!!

Share

Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ రియాల్టీ షోకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో హిందీ భాషలో ప్రారంభం కాగా తర్వాత దక్షిణాదిలో షో ప్రారంభమయ్యింది. అయితే మొదటి నుండి బిగ్ బాస్ రియాల్టీ షోపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. వివిధ రాజకీయ పార్టీల నేతలు .. సమాజం చైతన్యపరిచే సంఘాల నుండి బిగ్ బాస్ షో పై వ్యతిరేక కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటువంటి షో వల్ల.. యువత పెడదారి పడుతుందని… కుటుంబాలు కులిపోతున్నాయని.. చాలామంది కామెంట్ చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి బిగ్ బాస్ షో వల్ల యువత పెడదారి పడుతున్నరంటూ… 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. Ap highcourt serious on bigg boss reality show

ఈ క్రమంలో సోమవారం జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రియాల్టీ షో పేరుతో ఏది పడితే అది చూపిస్తాము అంటే కుదరదు అని.. కళ్ళు మూసుకొని కూర్చోలేమని.. ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రియాల్టీ షో పేరుతో హింసని ప్రోత్సహిస్తూ…సంస్కృతి ఎలా అంటారు అని ప్రశ్నించింది. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తరఫున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి.. తన వాదనలు వినిపిస్తూ పిటిషనర్ ఇటువంటి పిల్ గతంలో తెలంగాణ హైకోర్టులో వేసి ఉపసంహరించుకున్నారు అని తెలిపారు. రియాల్టీ షోకు విధివిధానాలు ఉంటాయని పేర్కొన్నారు.

Ap highcourt serious on bigg boss reality show

వివిధ సంస్కృతుల ఆధారంగా షో రన్ అవుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. రియాల్టీ షో పేరుతో హింసాని ప్రోత్సహించటం ఎలా సంస్కృతి అవుతుంది అని ధర్మాసనం నిలదీసింది. 2019 లోనే పిటిషనర్ తరఫు న్యాయవాది దీనిపైన అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో బెంచ్ నీ కోరటం జరిగింది. కానీ అక్కడ అనుమతి రాలేదు. అయితే పిటిషనర్ ఈ విషయాన్ని ఇన్చార్జి కోర్టుకు చెప్పకుండా విచారణ అనుమతి పొందారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ… గతంలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ కోరడం వాస్తవమేనని అంగీకరించారు.

Ap highcourt serious on bigg boss reality show

అలా కోరే హక్కు పిటిషనర్ కి ఉందని తెలిపారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని మరి ఆ విషయాన్ని ఎందుకు దాచారని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించారు. న్యాయస్థానంలో నిజాయితీగా వ్యవహరించాలని సూచించింది. అంతమాత్రమే కాదు ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ఎదుట అభ్యర్థించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పిన న్యాయస్థానం ఈ వ్యాజ్యాన్ని విచారణ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.


Share

Related posts

Face Packs: మీ చర్మం మెరుపు తగ్గిందా..!? వీటితో ఇలా ట్రై చేసి చూడండి చాలు..!!

bharani jella

Jio – Airtel – VI: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ కస్టమర్లకు అలర్ట్..!!

bharani jella

రామ్ చరణ్ సినిమా చేస్తాడనుకున్న దర్శకుడి విషయంలో మనసు మార్చుకున్నాడా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar