బస్సు ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గిచిన ఏపీఎస్ ఆర్టీసీ

చిరు వ్యాపారులకు సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్తను అందించింది. ఈ శుభవార్త రైతులకు, చిరు వ్యాపారులకు, తక్కువ రవాణా చేసేవారికి వర్తింస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే వీరిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీలో ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం వెళ్లడించింది. ఈ మేరకు తాజాగా ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ఏపీ ఆర్టీసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సరుకుల రవాణాను ఇంకా విస్తరించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ రవాణా ఛార్జీల తగ్గింపు వల్ల చిరు వ్యాపారులు, రైతులకు మేలు జరుగుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఛార్జీల తగ్గింపు ప్రకారం రవాణా ఛార్జీలు 50 శాతం వరకు సవరించినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అలాగే టన్ను బరువు ను 100 కిలోమీటర్ల దూరం చేర్చడానికి ఒక వెయ్యి రూపాయలను వసూలు చేస్తారు. అలాగే 500 కిలోలకు 100 కిలోమీటర్ల లోపు వరకు ఉన్న సరుకులకు కేవలం 500 రూపాయలను మాత్రమే వసూలు చేస్తారు.

అలాగే మూడు టన్నుల కనీస లోడు ఉంటే ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసే ఫెసిలిటీని కూడా కల్పించేందుకు ఆర్టీసీ సిద్దంకానుంది. అలాగే ఈ సరుకు రవాణాలో జీఎస్టీ, టోల్ ఛార్జీలు అసలుకే ఉండవని ఆర్టీసీ స్పష్టం చేసింది. దీనితో పాటుగా సరుకు రావాణా చేసే ఏంజెట్లు ఆర్టీసీ కార్గో సర్వీస్ బుక్ చేయొచ్చని తెలిపింది. ఆర్టీసీ కార్గోలో బుక్ చేస్తే నికర ఛార్జీపై 5 శాతం కమీషన్ చెల్లింపు కూడా ఉంటుందని ఆర్టీసీ స్పష్టం చేసింది.

అయితే ఈ బుకింగ్ కోసం మాత్రం ఆర్టీసీ డిపోలను లేదా సరుకు రవాణా కౌంటర్లలో సంప్రదించాలని ఆర్టీటీ సూచనలనిచ్చింది. ఈ ఛార్జీల తగ్గింపు కేవలం రవాణా చేసే వారికి మాత్రమే వర్తిస్తుందని ఏపీఎస్ ఆర్టీసీ వివరణ ఇచ్చింది. అయితే ఈ ఛార్జీల తగ్గింపుతో వారికి కొంత ఊరట లభించనుందనే చెప్పుకోవచ్చు.