రికరింగ్ డిపాజిట్ (RD)అనేది మీరు డబ్బు దాచుకునేందుకు ఒక మంచి సాధనం అని చెప్పాలి.RD పథకంలోని మంచి విషయం ఏమిటంటే.. మీరు దీనికి కేవలం 100 రూపాయలతో ప్రారంభించవచ్చు. మీరు ప్రతి నెల చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా కొన్ని సంవత్సరాలకు పెద్ద మొత్తాలను పొందే వీలుంది. బ్యాంకు లాగే RD పథకం పోస్ట్ ఆఫీస్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RDపై సంవత్సరానికి 5.8% వడ్డీ రేటు అందిస్తుంది. పోస్ట్ ఆఫీస్ RD పథకం వ్యవధి ఐదు సంవత్సరాలు దీనిలో ప్రతినెల నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. గడువు తేదీలోగా మీరు ఒక నెలలో వాయిదాను డిపాజిట్ చేయకపోతే మీరు నెలకు 1%చొప్పున జరిమానా కూడా చెల్లించాలి. అదే సమయంలో మీరు అనేక వాయిదాలను నిరంతరం డిపాజిట్ చేయకపోతే అకౌంట్ మూతపడే ప్రమాదం ఉంది.

అయితే మీరు ప్రతినిలా వాయిదా చెల్లించడం కష్టంగా మారిపోతే RD కొనసాగించడానికి మార్గం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. RD అకౌంట్ ఎప్పుడు మూసేస్తారు.. మీరు పోస్ట్ ఆఫీస్ లో వరుసగా నాలుగు వాయిదాలు జమ చేయలేనప్పుడు మీ అకౌంట్ మూసివేస్తారు. కానీ మీరు దానిని వచ్చే రెండు నెలల లోపు మళ్ళీ ప్రారంభిస్తామని దరఖాస్తు ఇస్తే ఆపై మూసివేయబడిన అకౌంటును మరోసారి ప్రారంభించవచ్చు. పుఃప్రారంభం అయినట్లయితే మీరు ముందుగా పెనాల్టీతో పాటుగా గత నెల బాకీ ఉన్న వాయిదాలను డిపాజిట్ చేయాలి.అయితే రెండు నెలల వ్యవదిలో ఎలాంటి దరఖాస్తు ఇవ్వకపోతే పూర్తిగా క్లోజ్ అయినట్లే..
మీ ఆర్థిక పరిస్థితి బాగా లేక కొంతకాలం పాటు RD వాయిదాలు జమ చేయడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు భావిస్తే.. మీరు వాయిదాలను జమ చేయకుండా కూడా మీ ఆర్డిటితో కొనసాగించవచ్చు. దీనికోసం మీరు RD అకౌంట్ మెచ్యూరిటీ వ్యవధిని తొలగించాలి. అయితే పరిస్థితిని ముందుగానే పసికట్టిన తర్వాత ఈ పని చేయాలి. నాలుగు నెలల పాటు వాయిదాలు చెల్లించిన తర్వాత మీరు ఈ ఎంపికను పొందలేరు. అయితే మెచ్యూరిటీ వ్యవధిని తొలగించే సమయాన్ని మీరు ఇన్స్టాల్మెంట్ చెల్లించలేని నెలల సంఖ్యను మాత్రమే పొడగించవచ్చును గుర్తుంచుకోండి..