Acidity Tablets: దీర్ఘకాలికంగా అసిడిటీ మందులు వాడుతున్నారా..!? ఏం జరుగుతుందో తెలుసుకుని జాగ్రత్తపడండి..!!

Share

Acidity Tablets: ఏదైనా ఆహారం తినగానే త్రేన్పులు, చిరాకు, గుండెలో మంట రావడాన్ని అసిడిటీ అంటారు.. సాధారణంగా మనం తీసుకునే ఆహారం వలన ఈ సమస్య వస్తుంది.. జిహ్వ చాపల్యం అధికంగా వుండేవారికి ఇది దగ్గరి చుట్టం.. దొరికింది కదా అని ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది తినేవారికి అసిడిటీ సమస్య అందుబాటులో ఉంటుంది.. అసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి తరచుగా మందులు వాడుతున్నారా..!? అయితే ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

Are you using Acidity Tablets: see what happens
Are you using Acidity Tablets: see what happens

Acidity Tablets: ఎసిడిటీ మందులతో మహిళలకే ఎక్కువ ముప్పు..!!

అసిడిటీ సమస్య నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఒమెప్రొజాల్ omeprazole, ప్రోటాన్ పంప్ ఇన్ హిబిటార్స్ Proton Pump Inhibitors (PPI) మందులు వేసుకుంటూ ఉంటారు వీటిని డాక్టర్లు వేసుకోమని చెప్పకపోయినా వారి అంతటికి వారే మెడికల్ షాప్ లో తీసుకొని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మాత్రలను నెలసరి నిలిచిపోయిన మహిళలు ఎక్కువ కాలం ఉపయోగించడం మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు.. ఎందుకంటే ఈ మందుల వలన ఎముకల పటిష్ఠం తగ్గి తుంటి ఎముకలు విరిగే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు..

Are you using Acidity Tablets: see what happens
Are you using Acidity Tablets: see what happens

బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హమీద్ ఖలీల్ బృందం ఇటీవల ఒక అధ్యయనం చేసింది.. ఈ పరిశోధన కోసం నెలసరి నిలిచిపోయిన 80 వేల మంది మహిళలను పరీక్షించారు. ఎనిమిదేళ్ల పాటు చేసిన ఈ అధ్యయనంలో పీపీఐ (PPI) మాత్రలు వేసుకునే వారిలో తుంటి ఎముక విరిగే ముప్పు 30 శాతం పెరిగినట్లు వారు గుర్తించారు అంతేకాకుండా పొగ తాగే అలవాటు ఉంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉన్నట్లు వారు గమనించారు. ఈ మందులను ఇప్పటినుంచి ఆపేస్తే ఎముక విరిగిపోయే ముప్పును రెండేళ్లలోనే సాదారణ స్థాయికి చేరుకుంటుందని వారు తెలిపారు.

Are you using Acidity Tablets: see what happens
Are you using Acidity Tablets: see what happens

అందువలన పీపీఐ (PPI) మందులను అవసరం మేరకే ఉపయోగించాలి. ప్రతిరోజు రెగ్యులర్ గా కూడా ఉపయోగించకూడదు. అసిడిటీ మందులను కొన్నాళ్లు వాడాక చేయడమే మంచిది. ఆపేసేయ్ మన్నారు కదా అని ఒక్కసారిగా తీసుకోకపోయినా కూడా ముప్పే. అయితే వెంటనే మానేస్తే త్రేన్పులు ఛాతీలో మంట మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు. అందువలన నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి అని వైద్యులు సూచిస్తున్నారు..

Are you using Acidity Tablets: see what happens
Are you using Acidity Tablets: see what happens

ముట్లుడిగిన వారికి కాల్షియం మాత్రలను సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే పీపీఐ లు మన శరీరం కాలుష్యాన్ని గ్రహించి ఈ ప్రక్రియను అడ్డుకుంటాయి. దీంతో క్యాల్షియం మందులు వేసుకున్న ఉపయోగం ఉండదు. అందువలన కాల్షియం మాత్రలు వేసుకుంటున్న వారిలో కూడా తుంటి ఎముక విరిగే ముప్పు ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఎసిడిటి మందులు ఉపయోగించే వారు ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటి నుంచైనా తగ్గించుకుంటూ వస్తే మంచిది. ముఖ్యంగా మహిళలు ఈ మందులను ఉపయోగించడం సాధ్యమైనంత వరకు తగ్గించండి.


Share

Related posts

AP Cabinet Meet: నేడు ఏపి కేబినెట్ భేటీ..! ఈ అంశాలపై కీలక చర్చ..?

somaraju sharma

YCP TDP: టీడీపీ అధినేత చంద్రబాబుపై గుంటూరు జిల్లాలోనూ కేసు నమోదు..!!

somaraju sharma

ఆరోగ్యం విషయంలో ఈ త‌ప్పులు చేస్తే.. భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌దు!

Teja