Arikelu: మన తాతలు, బామ్మలు అందరూ 80 లేదా 90 సంవత్సారాలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించేవారు.. నేడు 30 దాటటం తోనే అనేక ఆరోగ్య సమస్యలు తో బాధ పడుతున్నారు.. అందుకు కారణం మన ఆహారపు అలవాట్లు.. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం.. మన పెద్దలంతా చిరుధాన్యాలు ఆహారంగా తినేవారు.. మన డైట్ లో వాటికి భాగం లేదు.. చిరుధాన్యాలలో అరికెలు ఒకటి.. ఇందులో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. అరికెలు తింటే ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం..!!
Arikelu: అరికెలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
అరికెలు తీపి, వగరు, చేదు రుచిని కలగలిపి ఉంటాయి. అయినప్పటికీ ఇందులో బోలెడు పోషకాలు ఉన్నాయి. ఇది ఆకలిని తీర్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.. పిల్లలు, పెద్దలు వీటిని తినడం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది. పేగు క్యాన్సర్ దరిచేరకుండా చేస్తుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. రక్తంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని కొంచెం తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. అధిక బరువుతో బాధపడే వారు వీటిని తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. చిరుతిళ్ళ జోలికి వెళ్ళనివ్వదు. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది వీటిని ప్రతి రోజూ తినడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. అంతేకాకుండా టైఫాయిడ్, డెంగీ, ఈ సీజన్లో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది. అధిక పిండిని వాపులకు పైపూతగా వాడతారు.
పరుగు పందాలలో పాల్గొని వారు అరికెలు తింటే మంచి శక్తి లభిస్తుంది వేగంగా పరిగెత్తే గలుగుతారు. అరికెలు ను పప్పు దినుసులు, సెనగలు, బొబ్బర్ల తో కలిపి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి అరికెలు మంచి ఆహారం. వాత రోగులు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు వీటిని ఖచ్చితంగా వారి డైట్లో భాగం చేసుకోవాలి. ప్రతి రోజు తప్పనిసరిగా వీటిని తింటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఋతుక్రమం సక్రమంగా రాని వారు వీటిని తింటే రుతుచక్ర సమస్యలు తొలగిపోయి. ప్రతి నెలా సక్రమంగా రుతుక్రమం వస్తుంది. కంటి నరాల బలహీనత తో బాధపడేవారు అరికెలు తినడం మంచిది.