Lady Police: ప్రస్తుత సమాజంలో నిజాయితీ అనేది ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. కానీ ఇటువంటి కల్తి రోజులలో కూడా… నీతి నిజాయితీగా పనిచేసే అధికారులు.. అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు. ఈ తరహాలోనే అస్సాం రాష్ట్రంలో మహిళా పోలీస్ అధికారి… చట్టం ముందు అందరూ సమానమే అన్న తరహాలో వ్యవహరించి తన కాబోయే భర్త ని అరెస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే నాగాన్ జిల్లాలో రభా సబ్- ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉంది. ఆమెకు పోగగ్ అనే యువకుడితో గత ఏడాది అక్టోబర్ నెలలో నిశ్చితార్థం అయింది. ఈ ఏడాది నవంబర్ లో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే పోగగ్… తనని తాను ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా ఎస్ఐ రభాకి పరిచయం చేసుకోవడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో తన కాబోయే భర్త గురించి రభా పూర్తిగా ఎంక్వైరీ చేయగా అతడు పెద్ద మోసగాడు అని విచారణలో తేలింది. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్..(ONGC) లో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అని తప్పుడు సమాచారం ఇవ్వటం మాత్రమే కాదు.., అనేక మంది నిరుద్యోగులకు ఓఎన్జీసీ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేయడం జరిగిందట.
దీంతో వెంటనే రభా బాధితుల దగ్గర ఫిర్యాదు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాబోయే భర్త అని చూడకుండా పోగగ్ నీ కటకటాల పాలు చేయడం జరిగిందట. ఎస్ఐ రభా… పొగగ్ నీ అరెస్టు చేసిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ ఒక మోసగాడిని అరెస్టు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు. పెళ్లికి ముందే అతని నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. వివాహ జీవితంలో మోసపోకుండా తనని వాళ్ళు కాపాడారని, పొగగ్ ఎంతటి మోసగాడో అర్థమైందని..రభా తెలియజేయడం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో లేడీ పోలీస్ ఆఫీసర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లేడీ సింగం, లేడీ దబాంగ్ అంటూ పొగుడుతున్నారు.