32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అతియా శెట్టి-కేఎల్ రాహుల్ పెళ్లి..

Athiya Shetty and KL Rahul Marriage Updates
Share

Athiya Shetty and KL Rahul Marriage: టీమ్ ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి సోమవారం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ముంబైలోని సునీల్ శెట్టి విలాసవంతమైన భవనం ‘ఖండాలా ఫామ్ హౌస్‌ జహాన్’లో పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చేరుకున్నారు. హల్దీ ఫంక్షన్ కూడా నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు కేఎల్ రాహుల్-అతియా శెట్టికి పెళ్లి జరగనుంది. పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Athiya Shetty and KL Rahul Marriage Updates
Athiya Shetty and KL Rahul Marriage Updates: అతియా శెట్టి-కేఎల్ రాహుల్ పెళ్లి.. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో..పెళ్లిలో నో ఫోన్ పాలసీ..కుటుంబీకుల సమక్షంలోనే..

మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో..
గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట నేడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. సాంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకోనున్నారు. 2019లో కామన్ ఫ్రెండ్ ఏర్పాటు చేసిన ఓ పార్టీలో రాహుల్-అతియా తొలిసారిగా కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. దాంతో ఆ ఏడాది నుంచి డేటింగ్ స్టార్ట్ చేశారు. 2020 న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లారు. అప్పుడు వీరిద్దరి క్లోజ్‌గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దాంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందని అందరికీ తెలిసింది. 2021లో ఇంగ్లండ్ సిరీస్ అప్పుడు బీసీసీఐకి అతియాను తన భాగస్వామిగా చెప్పి.. ఆ టూర్‌కు కూడా తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతియా ఇంట్లో ఒప్పించి రాహుల్ నేడు పెళ్లి చేసుకోబోతున్నారు.

కుటుంబీకుల సమక్షంలోనే..
అతియా-రాహుల్ పెళ్లి ఇరు కుటుంబాల తరఫున కేవలం 100 మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలను పిలవలేదని సమాచారం. అయితే పెళ్లి అయిన కొన్ని వారాల తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. అప్పుడు అందరినీ పిలవనున్నట్లు తెలుస్తోంది.

పెళ్లిలో నో ఫోన్ పాలసీ..
సెలబ్రిటీల పెళ్లిళ్లలో ‘నో ఫోన్ పాలసీ’ అనే ట్రెండ్ నడుస్తోంది. దానిని అతియా-కేఎల్ రాహుల్‌కు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారట. తమ పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్లు తీసుకుని రావొద్దని చెబుతున్నారట. అలాగే పెళ్లి వేడుకలకు సంబంధించి ఎలాంటి ఫోటో షూట్స్, వీడియోలు తీయొద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సూచించారట. మూడేళ్లుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాదే వారి రిలేషన్‌ను సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

ఖరీదైన కారులో షికారుకి వెళ్తే ఆ మజానే వేరు, మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్ కొత్త కారు విలువు తెలిస్తే కంగుతింటారు!


Share

Related posts

kurupam YCP : డిప్యూటి సీఎం పుష్పశ్రీ వాణి ఇంట మామ కోడళ్ల సవాల్.. వైసీపీ నుండి మామ చంద్రశేఖర్ రాజు ఔట్..

somaraju sharma

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ ప్రాజెక్ట్ డేరింగ్ డైరెక్టర్ ఫిక్స్..?

GRK

buttermilk: పల్చని మజ్జిగ తాగుతున్నారా?అయితే ఇది తెలుసుకోండి!!

siddhu