Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ విజే సన్ని అందరికీ సుపరిచితుడే. ఎంటర్టైన్మెంట్ పరంగా ఫిజికల్ టాస్క్ పరంగా అన్ని రకాలుగా సన్నీ తనదైన శైలిలో సీజన్ ఫైవ్ లో రాణించాడు. ప్రారంభంలో కొన్ని వారాల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సన్నీ… కంటెస్టెంట్ ప్రియ ఆంటీతో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించి.. రెచ్చిపోయి చివరాకరికి టైటిల్ అందుకోవడం జరిగింది. హౌస్ లో మానస్, ఆర్జే కాజల్ వీరిద్దరితో మంచి బాండింగ్ క్రియేట్ చేసుకుని.. హౌస్ లో అద్భుతమైన గేమ్ ఆడటం జరిగింది.
అయితే బయటకు వచ్చిన సన్ని.. అనేక ఆఫర్లు అందుకుంటూ వస్తున్నారు. టైటిల్ విన్నర్ అయ్యాక సన్నీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతకుముందు సీరియల్ పరంగా ఓ మాదిరి గుర్తింపు ఉన్న సన్నీ ఇప్పుడు.. బిగ్ బాస్ పుణ్యమా.. ఇండస్ట్రీలో అనేక ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలాఉంటే ఇటీవల సన్నీ “ఏటీఎం” అనే సినిమా ఒప్పుకోవటం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి హైదరాబాద్ హస్తినాపురం లో షూటింగ్ జరుగుతూ ఉండగా.. అక్కడ ఒక రౌడీషీటర్… వీజే సన్నీతో గొడవకు దిగడం జరిగింది. అంతమాత్రమే కాదు సన్నీ పై దాడి కూడా చేయడం జరిగింది. దీంతో వెంటనే సినిమా యూనిట్ అలర్ట్ అయ్యి… సన్నీని షూటింగ్ నుండి కారులోకి తీసుకెళ్లిపోయారు.
అంతమాత్రమే కాదు వెంటనే సినిమా యూనిట్ పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. దీంతో పోలీసులు వచ్చి ఆ రౌడీషీటర్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజే సన్నీ పై దాడి అనే వార్త ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై చాలా మంది నెటిజన్లు స్పందిస్తూ తెలుగు బిగ్ బాస్ విన్నర్ లకు బయట కలిసి రావడం లేదని అంతకుముందు రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు వీజే సన్నీ పై దాడి.. ప్రస్తావన తీసుకు వచ్చి రకరకాల కామెంట్లు చేస్తున్నారు.