ట్రెండింగ్

Andrew Symond’s: ఆస్ట్రేలియా క్రికెట్ కి దెబ్బ మీద దెబ్బ మరో కీలక స్టార్ క్రికెటర్ మృతి..!!

Share

Andrew Symond’s: అంతర్జాతీయ క్రికెట్ పరంగా ఆస్ట్రేలియా తిరుగులేని జట్టు అని అందరికీ తెలుసు. ఎటువంటి టోర్నమెంట్ అయినా ఆస్ట్రేలియా టీం ఉంది.. అంటే మిగతా టీం సభ్యులు.. సదరు టీం దేశానికి చెందిన క్రికెట్ లవర్స్ భయపడే పరిస్థితి ఉంటది. అటువంటి ఆస్ట్రేలియా క్రికెట్ మండలి కి దెబ్బ మీద దెబ్బ పడుతూ చాలా మంది ప్రముఖులు ఇటీవల చనిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ గత రాత్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

Australian former player andrew symonds died in road accident

46 సంవత్సరాల వయసు కలిగిన సైమండ్స్.. 26 టెస్టులు.. 196 వన్డే మ్యాచ్ లు ఆస్ట్రేలియా టీం తరఫున ఆడటం జరిగింది. ఇదిలా ఉంటే క్వీన్స్ ల్యాండ్ రాష్ట్రంలో టౌన్స్ విల్లే లో గత రాత్రి కారు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మరణించాడు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని రక్షించే ప్రయత్నం చేసినా గాని కారు బోల్తా పడటంతో.. తీవ్ర గాయాలు కావడంతో అప్పటికే సైమండ్స్ మరణించినట్లు పోలీసులు తెలియజేశారు. దీంతో ఈ వార్త తెలుసుకుని క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు సోషల్ మీడియాలో సైమండ్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

సైమండ్స్ మృతి వార్త అసలు నమ్మలేకపోతున్నామని తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ లో 2003, 2007 ప్రపంచకప్ గెలిచిన టీం లో సైమండ్స్ కూడా ఒకడు. ఆస్ట్రేలియా క్రికెట్ టీం లో తిరుగులేని ఆల్ రౌండర్ గా సైమండ్స్ మృతి వార్త అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ లో దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, మరో మాజీ క్రికెటర్ రడ్ మార్ష్ మృతి చెందడం జరిగింది. అయితే ఇంతలోనే సైమండ్స్ మృతి చెందటంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచం దుఃఖసాగరంలో మునిగిపోయింది.


Share

Related posts

Mahesh Trivikram: అప్ కమింగ్ సినిమా కోసం సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్న మహేష్-త్రివిక్రమ్..??

sekhar

HBD Ram Charan : మెగాస్టార్ చిరంజీవి – చెర్రీ బర్త్ డే సందర్భంగా పోస్ట్ చేసిన స్పెషల్ వీడియో అదుర్స్..

bharani jella

టాప్ ఫీచర్లతో దూసుకొస్తున్న కీయా సోనెట్..! ఓ లుక్కేయండి..!!

bharani jella