Auto Driver: ఆటో డ్రైవర్ Auto Driver కష్టానికి అదృష్టం తోడైతే ఫలితం ఎలా ఉంటుందో రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన రంజిత్ సింగ్ నిరూపించాడు. అసలే పేదరికం.. పైగా పదో తరగతి ఫెయిల్. దీంతో 16 ఏళ్లకే ఆటో డ్రైవర్ అయ్యాడు. జైపూర్ కు ఫారిన్ టూరిస్టులు ఎక్కువ. దీంతో స్థానిక ఆటో డ్రైవర్లు ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుని డ్రైవర్ అండ్ గైడ్ గా ఉంటారు. అయితే.. రంజిత్ కు ఇవేమీ రాకపోవడంతో టూరిస్టులు రంజిత్ ఆటో ఎక్కేవారు కాదు. దీంతో పట్టుదలతో ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ నేర్చుకున్నాడు. ఆటో డ్రైవింగ్ తోపాటు సొంతంగా టూరిస్ట్ బిజినెస్ ప్రారంభించాడు. మాట తీరు, స్టైల్ మార్చి టూరిస్టులను ఆకర్షించాడు. అక్కడే రంజిత్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
రంజిత్ బిజినెస్ పెరగడంతో సంపాదన కూడా పెరిగింది. ఈక్రమంలో ఫ్రాన్స్ నుంచి జైపూర్ కు ఫ్రాన్స్ నుంచి టూరిస్టుగా ఓ యువతి వచ్చింది. గోవిందా గోవింద సినిమాలో నాగార్జున-శ్రీదేవి తరహాలో వీరిమధ్య స్నేహం.. ఆపై ప్రేమ చిగురించింది. తర్వాత ఆమె ఫ్రాన్స్ వెళ్లిపోయింది. అయినా.. వీరి ప్రేమ కంటిన్యూ అయింది. వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లింది. ప్రేయురాల్ని కలిసేందుకు ఫ్రాన్స్ వెళ్లాలనుకున్న రంజిత్ కు వీసా నిబంధనలు అడ్డొచ్చాయి. ఫ్రాన్స్ ఎంబసీ రంజిత్ వీసాను రిజెక్ట్ చేసింది. దీంతో రంజిత్ ప్రియురాలు స్వయంగా భారత్ వచ్చి ఫ్రాన్స్ ఎంబసీలో రంజిత్ వీసా సమస్యను పరిష్కరించింది. రంజిత్ ను ఫ్రాన్స్ తీసుకెళ్లింది. 014లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు.
Read More: hair growth: పట్టు కుచ్చు లాంటి ఒత్తైన జుట్టు కోసం ఇలా చేయండి!!
ప్రస్తుతం లాంగ్ టర్మ్ వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే.. మన ఫుడ్ వేరు ఫ్రాన్స్ ఫుడ్ వేరు. దీంతో అక్కడి ఆహారం పడక సొంతంగా వండుకోవడం మొదలుపెట్టాడు. పనిలోపనిగా వంటలను యూట్యూబ్ లో అప్లోడ్ చేసాడు. సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో స్థిరపడ్డారు. అక్కడా ఇదే పని. లోకల్ గా వంటలు నేర్పిస్తూ.. ఫేమస్ యూట్యూబర్ గా మారిపోయాడు. తన వీడియోలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాపులారిటీని కంటిన్యూ చేస్తూ సొంతంగా ఓ రెస్టారెంట్ ప్రారంభించే యోచనలో ఉన్నాడు. రంజిత్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.