బిగ్ బాస్ షో లో హైలెట్ కావాలని ప్రతి కంటెస్టెంట్ తమ విశ్వప్రయత్నాలను చేస్తున్నారు. అందులో కొందరు అందాల ఆరబోతలు చేస్తుంటే మరికొందరేమో తమ సహజ ప్రతిభను చూపుతున్నారు. అలాగే మరికొందరైతే గేమ్స్ ప్లే చేస్తూ బిగ్ బాస్ కంట పడడానికి దారులు వెతుక్కుంటున్నారు. అలాగే ప్రతి కంటెస్టెంట్ ఏదో ఒక ట్రిక్ ప్లే చేసి అభిమానుల దఈష్టిలో పడడానికి తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు. బిగ్ బాస్ షో లో ప్రస్తుతం మోనాల్ గజ్జర్, అభిజీత్, అఖిల్ ట్రయాంగిల్ పైనే నడుస్తోంది. దీనితో ఈ షోలో ఆడియెన్స్ మదిలో పడాలంటే ఇలాంటి స్టోరీనే ప్లే చేయాలని కొందరు భావిస్తూ అలాగే చేయడానికి విశ్వప్రయత్నాలు చేసేస్తున్నారు. ఇందులో భాగమే ముక్కు అవినాశ్.
జబర్దస్త్ షో తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాశ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ 4 లోకి అడుగుపెట్టారు. కచ్చితంగా తన ప్లాన్ ప్రకారమే ముందుకు వెలుతున్నట్టు తెలుస్తోంది. ముక్కు అవినాశ్ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అమ్మాయిలందరితో పులిహోర కలుపుతూనే ఉన్నాడు. దీనిలో భాగంగా వచ్చిన మొదట్లో మోనాల్ గజ్జల్ కు బిస్కెట్ల వేసినా అవి ఏ మాత్రం వర్కౌట్ కాలేదన్న విషయం తెలిసింది.
దీనితో తన ప్రయత్నాన్ని విరమించకుండా పట్టు విడువని విక్రమార్కుడిలా మళ్లీ జోర్దార్ సుజాతతో కూడా తన ట్రిక్స్ ప్లే చేశాడు. సుజీ.. సుజీ అంటూ ప్రేమగా పిలుస్తూ ఫీలింగ్ కలిగేలా చేసుకున్నాడు. అందరితోనూ అలాగే మెలగడం కారణంగా అదీ అవినాశ్ కు బిడిసి కొట్టినట్టయింది. దానితో ఆగకుండా అవినాశ్… నీ పెళ్లి కాకుండా చేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
అలాగే అవినాశ్ చేసే ప్రయత్నాలకు ఆకరుకు అరియానాతో ట్రాక్ బాగానే కుదిరింది. అరియానాతో అవినాశ్ కు ఏదో ఉందంటూ నాగార్జున సీన్ క్రియేట్ చేయడంతో వీళ్ల మధ్య నిజంగానే ఏదో నడుస్తోందని అందరూ అనుకునేలా చేశారు. దీంతో వారి మధ్య సానిహిత్యం బాగానే కొనసాగుతూనే ఉంది.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో వాళ్లు చూపించిన చనువుకు ఇది నిజమేమో అనుకునేలా ఉంది. అరియానాకు అవినాశ్ మేకప్ వేస్తూ నేను లేకుండా ఎలా బతుకుతావ్ అని అంటే ఏదో అలా బతుకు బండిని ఈడుస్తా అంటూ అరియానా చెప్పింది. ఇలా వీరి మధ్య మూటలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరిగా బిగ్ బాస్ ఇంట్లో మెలగాలంటే పులిహోర తప్పనిసరిగా మారిందని చెప్పొచ్చు.