Dental Care: మీరు మీ పళ్ళతో ఇలా చేస్తున్నారా..!?

Share

Dental Care: చిరునవ్వుతో చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు.. చిన్న చిరునవ్వు మీ ముఖాన్ని మరింత అందంగా ప్రతిబింబిస్తుంది.. అటువంటి చిరునవ్వుకు అందమైన పళ్ళు కూడా అంతే అవసరం.. కొన్ని అలవాట్లు మన దంత ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. మరి మనం చేసే ఆ చిన్న పొరపాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

avoid these habits for your Dental Care:
avoid these habits for your Dental Care:

Dental Care: చక్కటి చిరునవ్వు కోసం ఈ అలవాట్లు మానుకోండి..!!

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. మనం కేవలం ప్రతిరోజు బ్రష్ చేసుకుంటే సరిపోదు. చర్మ సంరక్షణ కోసం ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే మన దంత ఆరోగ్యానికి కాస్త సమయం కేటాయించాలి. దంతాలతో చేయకూడని పనులు చేయకూడదు. అలాగే కొన్ని పదార్థాలు తిన్న కూడా వీటి ఆరోగ్యం దెబ్బతింటుందని అలాంటి పనులు చేయద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

avoid these habits for your Dental Care:
avoid these habits for your Dental Care:

కొంత మంది పళ్ళతో నూనె ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇలా పలు రకాల ప్యాకెట్లు చించుతుంటారు. మరి కొంత మంది డ్రింక్ సీసాల మూతలు తీయడం, ప్లాస్టిక్ బాటిల్స్ మూతలు నోటితో పట్టుకుని తీస్తారు. ఇలా చేయడం వలన పళ్ళు బలహీనపడతాయి. కొన్ని కొన్ని సార్లు పళ్ళు విరిగిపోతాయి. కొందరు ఒత్తిడి కారణంగా గోళ్లను నోటితో కొరుకుతూ ఉంటారు. గోళ్లు లో ఉంటే మట్టి, ధూళి వలన దంత ఆరోగ్యానికి హని చేస్తుంది. ఒక వేళ గోళ్ళు శుభ్రంగా ఉన్న కూడా నోటిలో నోళ్ళు కోరకకూడదు. పళ్ళు కొరకడం, ఒత్తిడిగా ఉన్నప్పుడు పళ్ళు నురడం వంటివి చాలా మంది చేస్తుంటారు. వీటి వలన దవడ ఎముకలు బలహీనంగా అవుతాయి.

avoid these habits for your Dental Care:
avoid these habits for your Dental Care:

చల్లటి పదార్ధాలు, కూల్ డ్రింక్స్ వంటి చల్లటి పానీయాలు తాగటం వలన దంతాలు సేన్సిటివిటి కి గురవుతాయి. బాగా చల్లటి నీళ్ళు, ఐస్ క్యూబ్స్ తిన్నప్పుడు పళ్ళు సేన్సిటివిటి లోనవడం గమనించవచ్చు. టీ, కాఫీ తాగినప్పుడు వెంటనే నోటిలో కాసిన్ని నీళ్ళు పోసుకుని పుక్కిలించి ఉసేయలి. లేదంటే పళ్లకు వాటి రంగు గారా పడుతుంది. ముఖ్యంగా ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే పళ్లను ఎక్కువ సేపు తోమటం. పళ్లను ఎక్కువ సేపు రుద్దితే పంటి పై ఉండే ఎనామిల్ అరిగిపోతుంది. మరి ఎక్కువగా కాకుండా అలా అని అసలు తోమకుండ ఉండకుండా మధ్యస్థంగా కడగాలి. పళ్ళపై ఎడమ, కుడి, పైకి, కిందకి ఇలా అన్ని చోట్లా రుద్ది కడగాలి. అప్పుడే పంటిలో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. పంటీలో ఏవైనా ఇరుక్కు పోతే పిన్నిసు పెట్టీ పుల్లలు పెట్టీ తియకండి. అక్కడ పళ్లలో గ్యాప్ ఏర్పడి పళ్ళు పాడాయే అవకాశం లేకపోలేదు.


Share

Related posts

ఎస్ పి బాలుకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి లేఖ రాసిన ఏపి సీఎం వైఎస్ జగన్

Special Bureau

Atchan Naidu : సజ్జల రామకృష్ణారెడ్డి పై అచ్చెన్నాయుడు కీలక కామెంట్స్..!!

sekhar

ట్రంప్ కోటను కూల్చినట్టేనా..!? అమెరికా ఎన్నికలు ఎటువైపు..!?

Srinivas Manem