Fits: మూర్ఛ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కా..!!

Share

Fits: మనం రోడ్డు మీద వెళ్తుంటే హఠాత్తుగా ఒక మనిషి కింద పడి పోయి కాళ్లు చేతులు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి ఫిట్స్ వచ్చాయని అర్థం.. నోట్లో నుంచి నురగా కూడా వస్తుంది. దీన్ని మూర్ఛ వ్యాధి అంటారు. బ్రెయిన్ లో కలిగే కొన్ని సమస్యల వలన ఈ వ్యాధి వస్తుంది. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. మన బ్రెయిన్ లో తరచుగా విద్యుత్ ప్రవాహలు వెళుతూ ఉంటాయి. ఈ విద్యుత్ ప్రవాహం లో కాస్త హెచ్చుతగ్గులు ఏర్పడితే ఫిట్స్ వస్తాయి.. అయితే ఈ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు.. దీనికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మాత్రలు తయారుచేసుకొని ఉపయోగిస్తే ఫిట్స్ సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు..!!

Ayurvedic medicine to check Perminantly to Fits:
Ayurvedic medicine to check Perminantly to Fits:

 

Fits: మూర్ఛ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే ఆయుర్వేద మాత్రలు తయారు చేసుకునే విధానం..!!

 

కావలసిన పదార్థాలు : అక్కలకర్ర చూర్ణం – 100 గ్రాములు, సరస్వతి ఆకు చూర్ణం – 50 గ్రాములు, అశ్వగంధ పొడి – 10 గ్రాములు, శంఖ పుస్పి పొడి – 10 గ్రాములు, వస పొడి – 10 గ్రాములు, పిప్పళ్ళు పొడి – 10 గ్రాములు, సొంటి పొడి – 10 గ్రాములు, సుగంధపాల పొడి – 10 గ్రాములు, చంగల్వ కోస్టు పొడి – 10 గ్రాములు, రుమీ మస్తకి పొడి – 10 గ్రాములు,వావిలి చెట్టు వేర్లు పొడి – 10 గ్రాములు, కుసుమ చెట్టు వేర్లు పొడి – 10 గ్రాములు, తమలపాకు ఎండించిన పొడి – 10 గ్రాములు, కుంకుమపువ్వు – 1 గ్రాము, గోరోజనం – 1 గ్రాము, కస్తూరి పొడి – 1 గ్రాము, స్వచ్ఛమైన ఇంగువ పొడి – 1 గ్రాము, తేనె – 250 గ్రాములు, నెయ్యి – 100 గ్రాములు.

Ayurvedic medicine to check Perminantly to Fits:
Ayurvedic medicine to check Perminantly to Fits:

ముందుగా పైన చెప్పిన పదార్థాలన్నింటిని సేకరించి విడివిడిగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడి లన్నింటిని తీసుకొని కలుపుకోవాలి ఇలా తయారుచేసుకున్న చూర్ణం లో 25 గ్రాములు తేనె, 100 గ్రాములు నెయ్యి కలిపి తగినన్ని నీరు పోసి ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠాణీ గింజంత సైజ్ లో మాత్రలు చేసుకోవాలి. ఈ మాత్రలు ఆరబెట్టుకోవాలి తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి రెండు మాత్రలను గోరువెచ్చటి నీటితో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే ఫిట్స్ సమస్య ఈ విధంగా తగ్గుతుంది. మునుముందు కూడా ఈ సమస్య రాకుండా ఉంటుంది. ఈ మాత్రలను సమస్య పూర్తిగా తగ్గిపోయే వరకు ఇవ్వాలి. ఒకవేళ మూర్ఛ వ్యాధి తగ్గిన మరికొన్ని రోజులు ఇస్తే తర్వాత రాకుండా ఉంటుంది.

 

ఈ మాత్రలు వేసుకునేటప్పుడు పత్యం పాటించాలి. అరటి పండు, గుమ్మడి పండు, చెరుకు, పనస పండు తీసుకోవాలి. అన్ని రకాల దుంపల కూరలు తినాలి. పుట్టగొడుగులు తినాలి. కోడి, మేక, కుందేలు, పావురం మాంసం తీసుకోవాలి. ఈ పత్యం పాటిస్తూ పైన చెప్పుకున్న మాత్రలు పన్నెండు నెలలు తీసుకుంటే ఫిట్స్ సమస్య, మూర్చా వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది..


Share

Related posts

Daily Horoscope ఆగష్టు 4th మంగళవారం మీ రాశి ఫలాలు

Sree matha

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గోపూజ మహోత్సవాలు.. సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma

టాటా చెప్పిన టాటా సఫారీ.. మరో కొత్త మోడల్ లో రానుందా ..?

bharani jella