Baal Aadhaar: ఎన్నిసార్లు ప్రయత్నించినా పిల్లలకు ఆధార్ కార్డు రాలేదా..!! ఇలా ట్రై చేయండి..!!

Share

Baal Aadhaar: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఉంటారు..  ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆధార్ కార్డ్ రాకపోవడంతో ఈ సమస్యను గుర్తించిన యూఐడిఏఐ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.. ఇలా వీరికి ఇచ్చే ఆధార్ ను బాల ఆధార్ కార్డ్ అని పిలుస్తారు. 5 సంవత్సరాలలోపు పిల్లలకు నీలి రంగుగల బాల ఆధార్ కార్డు ను ఉచితంగా అందజేస్తారు. ఈ ఆధార్ కార్డు కి పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ చేరనే ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి..!! అయితే పిల్లలకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత  వారి ముఖ చిత్రం, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ కచ్చితంగా అప్డేట్ చేయించుకోవాలి..!! బాల ఆధార్ కార్డు కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Baal Aadhaar: for Children the registration process
Baal Aadhaar: for Children the registration process

21days Baby: డబ్బాలో పెట్టి పాపను గంగానదిలో పారేశారు.. అందులో ఇంకా ఏం ఉన్నాయంటే..

* ముందుగా  యూఐడిఏఐ అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ లో ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్ Proceed for Book Appointment పై క్లిక్ చేయాలి.

* ఇందులో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ పిల్లల పేరు ఈమెయిల్ అడ్రస్ వంటి వివరాలను తెలియజేయాలి.

* తరువాత Book Appointment పై క్లిక్ చేసి, ఆధార్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ తేదీని, ఆధార్ కేంద్రాన్ని ఎంచుకోవాలి.

* రిజిస్ట్రేషన్ తేదీని రోజున పిల్లల పుట్టిన తేదీ సర్టిఫికెట్ ను, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ సంబంధిత పత్రాలను నమోదు కేంద్రానికి తీసుకువెళ్లాలి.

* ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే తల్లిదండ్రుల ఆధార్ కార్డు తో లింక్ చేసి  ఎక్ నాలెడ్జ్ మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా ఆధార్ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

* ఇలా నమోదు చేసుకున్న 60 రోజులలో దరఖాస్తు దారుల రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది.

* నమోదు ప్రక్రియ పూర్తి తరువాత 90 రోజుల్లో బాల ఆధార్ కార్డును మీరు తెలిపిన అడ్రస్ కు పోస్ట్ ద్వారా పంపిస్తారు.


Share

Related posts

‘రాష్ట్రానికి ఏమి చేశారు’?

somaraju sharma

800 కోట్ల డీల్… అందుకే గీతంలో అర్ధ‌రాత్రి కూల్చివేత‌లు

sridhar

రెడీగా ఉన్నారా అంటున్న సర్కారు వారి పాట ..!

GRK