25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బాబా మాస్టర్ దెబ్బకి సుధీర్ తో పాటు రష్మీ కూడా బుక్కైంది…!

Share

ఈటీవీ లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ‘ఢీ ఛాంపియన్స్’ డాన్స్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ తో సమానంగా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటున్న ఈ షో కి సుడిగాలి సుదీర్ ప్రత్యేక ఆకర్షణ. శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ ఖాసిమ్ జడ్జీలుగా…. రష్మీ, హైపర్ ఆది, వర్షిని లతో కలిసి యాంకర్ ప్రదీప్.. సుడిగాలి సుదీర్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

 

News18 Telugu - సుడిగాలి సుధీర్‌ను కన్నుగొట్టమన్న రష్మీ గౌతమ్.. ఏరులై పొంగిన ప్రేమ.. | Rashmi Gautam Sudigali Sudheer latest love skit in Dhee Champions was superb and Promo goes viral pk- Telugu ...

ఇందులో కంటెస్టెంట్స్ వేసే అబ్బురపరిచే డాన్సులు ఒక ఎత్తు అయితే సుధీర్ ను ఆటపట్టిస్తూ యాంకర్ ప్రదీప్ చేసే కామెడీ మరో ఎత్తు. ఓడిపోయిన టీం తరపువారు టాస్క్ లు చేయవలసి వస్తుంది. వీటిల్లో సుధీర్ తో యాంకర్ ప్రదీప్ ఆడుకుంటూ ఉంటాడు. ఇదే సమయంలో శేఖర్ మాస్టర్ కు రావడంతో బాబా భాస్కర్ గత రెండు వారాలుగా అతని ప్లేస్ లోకి వచ్చాడు. ఇక వచ్చి రాగానే సుధీర్ తో ఒక లెవల్ లో అందరూ ఆడుకోవడం మొదలు పెట్టారు. 

సుధీర్ మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. అలాగే యాంకర్ గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నారు. అలాంటి సుధీర్ ఏమి చేసినా నువ్వు వేస్ట్.. పరమ వేస్ట్ అని బాబా భాస్కర్ అనడం గమనార్హం. సరే సుధీర్ కు ఎంటర్టైన్మెంట్ లో ఇదంతా భాగమే. అయితే అతనితో పాటు అతనికి జోడీగా ఉన్న రష్మీ ని కూడా భాస్కర్ బాగా ఇబ్బంది పెట్టాడు. అర్థం పర్థం లేని ట్యూన్స్ ని మిక్స్ చేసి డాన్సులు వేయించడం ఆమెను కూడా అతని తో పాటు ఆడుకోవడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. టాస్క్ లపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని రష్మిని బాబా మాస్టర్ అలా ఇబ్బంది పెట్టడం కొత్తగా అనిపించింది. మొత్తానికి సుధీర్ తో జోడి కట్టినందుకు రష్మి బాగానే ఇరుక్కుంది.


Share

Related posts

Karthika deepam: ఈరోజుటి ‘కార్తీక దీపం’ ఎపిసోడ్ లో జరిగేది ఇదే, అంబులెన్స్ లో శ్రీవల్లి!

Ram

నాదెండ్ల విషయం లో పవన్ కల్యాణ్ ఫాన్స్ లో భిన్న అభిప్రాయాలు !!

Yandamuri

Seetimaar Review: సీటీమార్ మూవీ రివ్యూ

siddhu