ట్రెండింగ్ న్యూస్

Babu Gogineni: Tv9 యాంకర్ దేవీ నాగవల్లికి కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్న బాబు గోగినేని.. వైరల్ అవుతున్న పోస్ట్స్!

Share

Babu Gogineni:  దేవీ నాగవల్లి.. గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్న ఓ Tv9 యాంకర్. దీనికి కారణం అందరికీ తెలిసిందే. విశ్వక్ సేన్ విషయంలో దేవీ నాగవల్లి ప్రవర్తించిన తీరుకి విశ్వక్ మీద ఎంతఎత్తున విమర్శలు వెల్లువెత్తాయో అంతకంటే ఎక్కువగా దేవి మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతుండటం కొసమెరుపు. విశ్వక్ సేన్ F**K అనే పదాన్ని ఉపయోగించునేందుకు విమర్శిస్తే, దేవీ నాగవల్లి ‘గెట్ అవుట్’ ఫ్రమ్ మై స్టూడియో అని అన్నందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా ఎంట్రీ ఇచ్చి, టీవీ 9ని ఏకిపారేశాడు.

అయితే తాజాగా ప్రముఖ హేతువాది ఐనటువంటి బాబు గోగినేని కూడా వరుసగా పోస్టులు పెడుతూ దేవి నాగవల్లికి చుక్కలు చూపిస్తున్నాడు. టీవీ 9 ఇది వరకు చేసిన పిచ్చి ప్రాంక్ వీడియోలు, షోలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఛానెల్ ని ఎండగడుతున్నారు. దేవీ నాగవల్లి మాట్లాడిన మాటలు, ప్రవర్తించిన తీరు మీద కూడా కౌంటర్లు పడిపోతున్నాయి. ఇక ఆమధ్య తాజాగా దేవీ నాగవల్లి రోడ్డు మీద చిందులు వేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ రోడ్డు మీద ప్రాంక్ చేయగా తప్పుగాని, మీరు చేసే డాన్సులు ఏంటి అంటూ ఏకిపారేస్తున్నారు.

ఈ క్రమంలో దేవీ నాగవల్లి నీటికి ఉండే గురుత్వాకర్షణ శక్తి అంటూ ఏదేదో నోటికి అనేసి అభాసుపాలైన సంగతి తెలిసిందే. సదరు వీడియోను షేర్ చేస్తూ దేవి నాగవల్లి మీద బాబు గోగినేని ఈ రకంగా సెటైర్లు వేశారు. “బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు, న్యూటన్, ఐన్స్టైన్ లకు ఎవ్వరికీ లేని అవగాహన, ప్రపంచ చరిత్రలోనే విశ్వం గురించి ప్రప్రథమంగా ఒక న్యూస్ ఛానల్ లో ఆవిష్కరించబడిన అధ్భుత సత్యం. గురుత్వాకర్షణ శక్తి గురించి మానవాళికి ఓ జర్నలిస్ట్ అందించిన ఒక సరికొత్త అవగాహన. విశ్వాన్ని నడిపే 4 శక్తులను ఒకే ఫార్ములా తో ఎలా ఏకీకృతం చేయాలి అని శాస్త్రజ్ఞులు అందరూ జుట్టు పీక్కుంటున్న సందర్భంలో, నీటిలో ఉన్న విద్యుత్ శక్తికీ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికీ గల సంబంధాన్ని అవలీలగా వివరిస్తూ వార్త అందిస్తున్న మానసిక వైద్య నిపుణులురాలు జర్నలిస్ట్ దేవి గారు” అని బాబు గోగినేని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.


Share

Related posts

Mahesh Babu: రంగంలోకి దిగిన మహేష్ బాబు..!!

sekhar

Maruthi : మారుతి గోపీచంద్ కోసం ‘పక్కా కమర్షియల్’ కథ ని సిద్దం చేశాడు..!

GRK

Balakrishna : ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా బాలయ్య బాబు..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar