Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో లలో మొదటి వరుసలో ఉండేది నందమూరి బాలయ్య బాబు. ఇండస్ట్రీలో ఎవరికీ లేని రీతిలో బాలయ్యకి మంచి ఫ్యాన్ బేస్ మాస్ లో మొదటి నుండి ఉంది. కాగా ఇటీవలే “అఖండ” సినిమా విజయం సాధించడంతో బాలయ్యబాబు ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో… కుర్ర డైరెక్టర్లతో వరుసపెట్టి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో… ఒక డిఫరెంట్ మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు సినిమా ఒకే చేయడం జరిగింది. సినిమా సంగతి పక్కన పెడితే ఆహా లో “ఆన్ స్టప్పాబుల్” షోతో బాలకృష్ణ…హోస్ట్ గా.. తనలో కొత్త అన్ని బయటపెట్టి.. మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం తెలిసిందే.
ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో లను డైరెక్టర్లను మరికొంతమంది టెక్నీషియన్ లతో ఇంటర్వ్యూ చేసి వాళ్లతో ఎంటర్టైన్మెంట్ రా బట్టి వాళ్ళ ప్రైవేట్ విషయాలను… అడుగుతూ తనదైన శైలిలో షో నీ బాలయ్య రక్తి కట్టించడం హైలైట్ ఎంటర్టైన్మెంట్ అందించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్యబాబు అదే షోలో కోపాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్ తెలియజేసినారు. యాంగర్ మానేజ్మెంట్ అంటూ ..బాలయ్య మాట్లాడుతూ …”బయట నాకు చాలా కోపం అని అందరూ అనుకున్నారు. కానీ ఆహాలో “ఆన్ స్టప్పాబుల్” షోకి వచ్చాక… బాలయ్య అంటే అసలైన మేటర్ తెలిసింది. అంతకు ముందు బాలయ్య బాబు కి బాగా కోపం అని బయట టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు కోపాన్ని తగ్గించుకోవడానికి ఐదు సూత్రాలు చెబుతాను.
మొదటిది.. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడండి. రెండవది .. కోపం వచ్చినప్పుడు అంకెలు లెక్క పెట్టుకోండి. మూడవది .. అరుపులు కేకలు పెట్టకుండా అసలు ప్రాబ్లం ఏంటో ఆలోచించండి. నాలుగోది .. మనసులో ఏమి పెట్టుకోకుండా ఏదంటే అది బయటపెట్టి క్షమించండి. ఐదవది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైన ది తన కోపమే తన శత్రువు… తన శాంతమే తనకు రక్ష అని అన్నారు. ఎంత కోపం ఎక్కువ వస్తే మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుని శాంతంగా ఉండండి. ఎక్కడా కూడా కోపాన్ని ప్రదర్శించి అనవసర విషయాలకు… చాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అంటూ బాలయ్య తనదైన శైలిలో చిట్కాలు తెలియజేశారు.