ప్రస్తుతం దేశంలో కరోనా కాలం నడుస్తోంది. అడ్డూఅదుపు లేకుండా విజృంభిస్తున్న ఈ మహమ్మారి వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దీంతో ప్రజలు సైతం తక్కువ సమయంలోనే పనులు పూర్తి చేసుకోవాలని భావిస్తున్నారు. బ్యాంకుల పని వేళల్లో సైతం కరోనా మహమ్మారి విజృంభణ వల్ల అనేక మార్పులు వచ్చాయి. ప్రజలు వీలైనంత వరకు ఆన్ లైన్, ఏటీఎంల ద్వారా లావాదేవీలు జరపడానికి ఇష్టపడుతున్నారు.
పరిమిత సమయం మాత్రమే బ్యాంకులు పని చేస్తూ ఉండటంతో బ్యాంకుల సెలవు దినాలపై ఖచ్చితంగా అవగాహన ఉండాలి. లేని పక్షంలో లావాదేవీలకు ఆటంకం కలిగే అవకాశం ఉండేది. సాధారణంగా మిగతా నెలలతో పోలిస్తే అక్టోబర్ నెలలో ఎక్కువగా సెలవులు ఉంటాయి. అక్టోబర్ నెలలో 10, 24 తేదీలు రెండు, నాలుగు శనివారాలు కాబట్టి బ్యాంకులకు సెలవులు ఉంటాయి. 4 11, 18, 25 తేదీలు ఆదివారాలు కనుక ఆరోజులు బ్యాంకులకు సెలవు దినాలు.
ఇవి కాకుండా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన, మిలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా అక్టోబర్ 30వ తేదీన సెలవు దినాలు. సాధారణంగా అక్టోబర్ నెలలో దసరా పండుగ సెలవులు ఉంటాయి. అయితే పండుగ శని, ఆదివారాల్లో రావడంతో బ్యాంక్ ఖాతాదారులకు ఇబ్బంది లేదు. మిగిలిన రోజుల్లో మాత్రం బ్యాంకులు యధావిధిగా పని చేస్తాయి. పండుగలు ఉండటంతో అక్టోబర్ నెలలో వ్యాపార లావాదేవీలు కూడా జోరుగా జరుగుతాయి.
సెలవుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది.