Banyan Tree: మానసిక సమస్యలతో బాధపడుతున్నారా..!? ఈ చెట్టు ఆకులతో చెక్ పెట్టండి..!!

Share

Banyan Tree: మర్రిచెట్టు మన జాతీయ వృక్షం గా అందరికీ తెలుసు.. ఈ చెట్టును వట వృక్షం అని కూడా పిలుస్తారు.. ఈ చెట్టు పట్టణాలలో కంటే పల్లెటూర్లలో నే ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది.. పల్లెటూర్లలో ఈ చెట్టు కింద కూర్చుని సేద తీరితే మంచిదని పెద్దలు చెబుతుంటారు.. మరి చెట్టు కిందే సేద తీరితేనే మంచిది అయితే.. మరి ఈ చెట్టు ఆకులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Banyan Tree: to check psychological problems and disorder
Banyan Tree: to check psychological problems and disorder

Banyan Tree: మర్రి చెట్టు ఆకులతో ఈ మానసిక సమస్యలను జయించవచ్చు..!!

మర్రిచెట్టు ఆకులు, కాండం, వేర్లు, బెరడు ను ఆయుర్వేద వైద్యం లో పలు ఔషధాల  తయారీ లో ఉపయోగిస్తున్నారు.. మర్రిచెట్టు అనేక వ్యాధులు, అంటురోగాల చికిత్సకు ఉపయోగపడుతుంది.. బాగా ఎండిన 15 ఆకులను ఒక లీటర్ నీటిలో వేసుకుని పావు లీటర్ అయ్యేవరకు మరిగించాలి. ఈ నీటిని వడపోసుకొని మూడు చిటికెలు ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని ఉదయం, సాయంత్రం త్రాగటం వలన గుండె బరువెక్కడం, నిద్రలో అరావడం, భయపడటం, పీడకలలు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి..

 

Banyan Tree: to check psychological problems and disorder
Banyan Tree: to check psychological problems and disorder

Banyan Tree: మర్రి ఆకులతో ఇలా ప్రయత్నించి చూడండి..!!

20 గ్రాములు మర్రి ఆకులను తీసి తీసుకొని ముద్దగా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ నీరు అయ్యేంతవరకు మరిగించాలి. ఈ నీటిని వడపోసుకుని వెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో చెంచా పటిక బెల్లం కలిపాలి. ఈ కషయాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూట్ల తీసుకుంటే రక్తం లోని మలినాలు తొలగిపోతాయి. రక్తం శుభ్రపడుతుంది. దీని వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఒకవేళ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయాన్ని సేవిస్తే వీర్యవృద్ధి కలుగుతుంది. ఈ మర్రి చెట్టు ఆకుల ఎండబెట్టి పొడి చేసుకోవాలి. దీనికి సమాన మోతాదులో కలకండ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం అర చెంచా మోతాదులో ప్రతిరోజూ తీసుకుంటే స్త్రీలలో రుతుక్రమం సమయం లో వచ్చే నొప్పులు తగ్గిపోతాయి. రుతుక్రమం సక్రమంగా వస్తుంది.

Banyan Tree: to check psychological problems and disorder
Banyan Tree: to check psychological problems and disorder

లేత మర్రి ఆకులను పది గ్రాములు తీసుకుని అందులో 150 గ్రాములు మంచి నీరు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డ లో వేసి వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసానికి కొంచెం పటికబెల్లం కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే గుండెదడ తగ్గిపోతుంది. మర్రి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడి పావు చెంచా మోతాదులో ఒక గ్లాసు నీటిలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.


Share

Related posts

Brahmamgari Matham: బ్రహ్మం గారి మఠం వివాదం..! పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మికి గ్రామస్తుల షాక్..!!

somaraju sharma

Anil ravipudi : అనిల్ రావిపూడి కి ఇస్మార్ట్ శంకర్‌లో బాలీవుడ్ హీరో కనిపించాడా..!

GRK

Anu Emmanuel: గ్లామర్ డోస్ ఎంత పెంచినా ఆ సినిమా సక్సెస్ కాకపోతే అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌కి పెద్ద రిస్కే

GRK