33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

BB3 Title: బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” వచ్చేస్తున్నాడు ..!!

Share

BB3 Title: నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.. తాజాగా ఈరోజు ఉగాది సందర్భంగా ఈ సినిమాకి “అఖండ” టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్..!!

BB3 movie Title declared now
BB3 movie Title declared now

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ లో కవల సోదరులుగా నటించనున్నారు.. అంతే కాదు ఒకటి అగోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని అంటున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు. మరోవైపు శరత్ కుమార్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ ను కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పిక్చరైజ్ చేస్తున్నారు.. ఈ చిత్రానికి కి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను మహా నటుడు ఎన్టీఆర్ జయంతి మే 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


Share

Related posts

నా భార్యకు బిఫాం ఇవ్వండి

somaraju sharma

SSMB 28: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసిన తమన్..!!

sekhar

శేఖ‌ర్ క‌మ్ముల న‌యా నాయిక‌!

Siva Prasad