BCCI: భళా బీసీసీఐ..!! కరోనాపై పోరుకు భారీ సాయం..!! 

Share

BCCI: కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి ఎందరో మృతిచెందారు.. రోజురోజుకు పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత కారణంగా ప్రజలు నానా యాతన పడుతున్నారు.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బీసీసీఐ తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది..!! 10 లీటర్ల సామర్ధ్యం గల 2000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది..!!

BCCI: donates 2000 Oxygen Concentrators
BCCI: donates 2000 Oxygen Concentrators

భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “వైరస్ పోరాటంలో వైద్య సిబ్బంది పాత్ర మరువలేనిది. మనల్ని కాపాడడం కోసం వారు ఏం చేయాలో అంతా చేస్తున్నారు. వారే నిజమైన ఫ్రెండ్ లైన్ వారియర్స్. బీసీసీఐ బోర్డు ఎప్పుడు ఆరోగ్యం, రక్షణ కు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు చాలామందికి ప్రస్తుతం తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. చాలా మందిని కాపాడుతాయి” అని తెలిపారు.. బీసీసీఐ చేస్తున్న ఈ సాయానికి పలువురు ప్రముఖులు, క్రికెట్ అభిమానులు భళా బీసీసీఐ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇటువంటి విపత్కర సమయంలో కరోనాపై పోరుకు గెలిచేందుకు బీసీసీఐ భారీ సాయం అందిస్తోంది. రానున్న రోజుల్లో బీసీసీఐ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందించనుంది. బీసీసీఐ కార్యదర్శి జయ్ షా స్పందిస్తూ ప్రస్తుతం వైద్య పరికరాలకు తీవ్ర కొరత ఏర్పడిందని ఆ దిశగా సాయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.


Share

Related posts

18న అమిత్ షా రాక

Siva Prasad

153 కే 100 ఛానల్స్: ట్రాయ్

Siva Prasad

Dark mode: ‘డార్క్ మోడ్’తో క‌ళ్ల‌కు లాభ‌మేనా..?

Teja