ట్రెండింగ్ న్యూస్

క్రికెట్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్న బీసీసీఐ..!!

Share

క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్ న్యూస్ తెలపటానికి రెడీ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచులు చూసే అవకాశం గత కొంత కాలం నుండి లేని సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో తాజాగా దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నా క్రికెట్ లవర్స్ కి శుభవార్త చెబుతూ ఇంగ్లాండ్ ఇండియా సిరీస్ కి ఆడియన్స్ ని స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తోంది.

ODI World Cup out of India for tax exemption: BCCI | Newsmobileఇదిలా ఉంటే స్టేడియం మొత్తం కాకుండా 50 శాతం మంది మాత్రమే.. స్టేడియం లోకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. కరోనా వైరస్ కారణంగా ఈ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే ప‌రిమితం చేశారు. ఇందులో చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణె నగరాలను గుర్తించారు.

 

ఈ సిరీస్ లో ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు తో పాటు నాలుగు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. చివరిసారిగా గత ఏడాది జనవరి మాసంలో ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ ప్రేక్షకులు మైదానంలో తిలకించడం జరిగింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు జరిగినా గాని ప్రేక్షకులు లేకుండానే జరగటంతో.. పెద్దగా ఎవరు ఎంజాయ్ చేయలేక పోయారు.  పైగా  కరోనా దెబ్బకు ఐపీఎల్ మ్యాచ్ లు దుబాయిలో  జరిగాయి.

 


Share

Related posts

TTD: భక్తులకు TTD సువర్ణావకాశం.. ఓన్లీ ఫర్ లోకల్స్!

Ram

వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు

Mahesh

A.M. Ratnam: కొడుకు రీ ఎంట్రీ కోసం అదిరిపోయే ప్లానింగ్ వేసిన ఏఎమ్ రత్నం..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar