Will Smith: ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ ఈ ఏడాది ఆస్కార్ అవార్డు ప్రధానం చేసే సమయంలో హాలీవుడ్ సూపర్ స్టార్ హీరో విల్ స్మిత్ భార్య జాడ పై కామెడీ చేయటంతో స్టేజ్ పైనే విల్ స్మిత్..క్రిస్ నీ చెంపమీద కోట్టడం తెలిసిందే. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ఇక అదేసమయంలో అవార్డు అందుకున్న తర్వాత… క్రిస్ కి క్షమాపణలు చెప్పడం మాత్రమే కాదు నిర్వాహకులకు మరియు నామినిలకు కూడా విల్ స్మిత్ క్షమాపణలు తెలియజేశాడు.
సోషల్ మీడియాలో కూడా క్రిస్ రాక్ నీ క్షమించమని కోరడం జరిగింది. అయితే ఉన్న కొద్దీ వివాదం పెరుగుతున్న తరుణంలో విల్ స్మిత్… హాలీవుడ్ ఫిలిం అకాడమీకి రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఎటువంటి చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు విల్ స్మిత్ కెరియర్ మొత్తానికి డేంజర్ జోన్ లో పడినట్లు.. వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే విల్ స్మిత్ నెక్స్ట్ సినిమా “ఫాస్ట్ అండ్ లుజ్” ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మాణ బాధ్యతలు చేపడుతున్న తరుణంలో చెంపదెబ్బ వివాదంతో…నెట్ ఫ్లిక్స్ “ఫాస్ట్ అండ్ లుజ్” సినిమాని హోల్డ్ లో పెట్టినట్లు హాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
అంతమాత్రమే కాదు ఇక ఇదే సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి డైరెక్టర్ డేవిడ్ లిచ్ రియన్ కూడా తప్పుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అర్ధాంతరంగా ఈ సినిమా ఆగిపోయినట్లు టాక్ నడుస్తోంది. విల్ స్మిత్ భవిష్యత్తులో చేయాల్సిన కొన్ని సినిమాలు కూడా ఆగిపోయాయి అని అంటున్నారు. మరోపక్క హాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ లు, నిర్మాతలు అందరూ విల్ స్మిత్ …నీ పూర్తిగా బాయ్ కట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు బలమైన వార్తలు వినబడుతున్నాయి. మొత్తంమీద చూసుకుంటే చెంపదెబ్బ వివాదంతో విల్ స్మిత్..నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్క డైరెక్టర్ లేదా నిర్మాత విల్ స్మిత్ తో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదని హాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నయి.