NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Brain Stroke: కొన్ని రోజుల నుంచి ఈ లక్షణాలు కనిపిస్తూన్నాయా..!! అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించండి..!!

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతంతో ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. కొన్నిసార్లు సమస్య తీవ్రత కారణంగా కొంతమంది చనిపోతున్నారు.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గంట నుంచి నాలుగు గంటల లోపు హాస్పిటల్కి తీసుకు వెళితే ఈ ప్రమాదాన్ని కొంతవరకైనా అరికట్టవచ్చు.. పక్షవాతం వచ్చే ముందు కొన్ని రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వీటిని గుర్తించగలిగితే సమస్యకు ఆదిలోనే ముగింపు చెప్పవచ్చు.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు గురించి తెలుసుకుందాం..!!

Before Attacking Brain Stroke: Symptoms and causes
Before Attacking Brain Stroke Symptoms and causes

మన మెదడులో ఉన్న కొన్ని భాగాలకు రక్తప్రసరణ ఆగిపోవడం తో వచ్చే ప్రమాదమే బ్రెయిన్ స్ట్రోక్.. ఇక కణాల లోకి ఆక్సిజన్ సరఫరా నిలిచి పోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడులో రక్త ప్రసరణ నిలిచిపోయిన స్థానాలను బట్టి ముఖం బలహీనం కావడం, మూతి వంకర పోవడం, నడకలో తేడా రావడం, అస్పష్టంగా కనిపించడం, చేతులు బలహీనం కావడం, మాట్లాడటంలో ఇబ్బంది కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు కారణంగా ముప్పై లో కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది.

Before Attacking Brain Stroke: Symptoms and causes
Before Attacking Brain Stroke Symptoms and causes

Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే..!!

సాధారణంగా కొంతమందికి కాళ్లు చేతులు మొద్దుబారి పోతూ ఉంటాయి. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. రెండు చేతులు కాకుండా ఒక వైపు ఒక ప్రదేశంలో మాత్రమే మొద్దుబారటం గమనించవచ్చు. మహిళలు తల వెనుక భాగంలో తలనొప్పి ఎక్కువగా వస్తుంది. వాంతులు, వికారం గా అనిపిస్తాయి. కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలను మరచి పోతుంటారు. వీరి ప్రవర్తన లో మార్పు కనిపిస్తుంది. కొన్నిసార్లు భ్రమలో ఉన్నట్లుగా మాట్లాడతారు. అదే గర్భిణీ స్త్రీలలో అయితే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Before Attacking Brain Stroke: Symptoms and causes
Before Attacking Brain Stroke Symptoms and causes

శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీలో నొప్పి, శ్వాస సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారిలో కూడా ఈ సమస్య వస్తుంది. మెదడులో రక్త ప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. బ్రెయిన్ లో రక్తం ఎక్కడ గడ్డ కడుతుందో అక్కడ ఉన్న నరాల స్పందన ఆధారంగా శరీరం చచ్చుపడి పోతుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మూడు గంటల లోపు హాస్పిటల్ కు తీసుకు వెళితే పక్షవాతం చేతులు కాళ్లు చచ్చి బడకోకుండా నివారించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Before Attacking Brain Stroke: Symptoms and causes
Before Attacking Brain Stroke Symptoms and causes

సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి ప్రోటీన్స్ పోషకాలు ఉన్న ఆహారాన్ని మీ డైట్ లో భాగం చేసుకోవాలి. దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ ఉంటే వాటిని నియంత్రణ లో ఉంచుకోవాలి. పైన ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.

author avatar
bharani jella

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N