కొందరు ఎంతో ఆరోగ్యంగా.. ఆర్ధికంగా.. అందంగా ఉంటారు. అందుకే అలాంటి వారిని చూసి దేవుడు ఓర్చుకోలేడు. ఏదో ఒకరకంగా చావు ఇస్తాడు. ఆ చావులు చూస్తే ఇలా కూడా చనిపోతారా? అని ఆశ్చర్యం వేసేలా ఆ చావులు ఉంటాయ్. ఇక అలానే ఈరోజు కారు చక్రాల్లో వెంట్రుకలు ఇరుక్కొని ఒకరు మరణిస్తే మరొకరు కారు డోరులో చిక్కుకొని మరణించారు. రెండు ఘటనలు కారుకు సంబంధించినవే అయినప్పటికీ ప్రాంతాలు మాత్రం వేరు.
కర్ణాటకలోని బెంగుళూరుకు చెందిన ఓ మహిళ కారు దొరులో ఇరుక్కొని మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరుకు చెందిన సాఫ్ట్ వెర్ నందిని రావ్ అనే 45 ఏళ్ల మహిళ మృతి చెందింది. రివర్స్ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ప్రమాదం జరిగింది. చెట్టు, కారు డోర్ మధ్య ఇరుక్కుని సదరు మహిళ మరణించింది.
అయితే కొడుకు ఆడించడం కోసం బయటకు రాగ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు డోర్ కి చెట్టుకు మధ్య నందిని ఇరుక్కుపోయి తీవ్ర గాయాలపాలయ్యింది. సహాయం కోసం కేకలు వెయ్యగా స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించే సమయానికి ఆమె మరణించింది. కారు పార్క్ కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలిగించాలని ఎంతోమందికి ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోలేదని.. చెప్పినప్పుడే తీసి ఉంటే ఇలాంటి ప్రమాదం జరగదని స్థానికులు తెలిపారు.
కాగా నిన్న సాయింత్రం హైదరాబాద్ లో కూడా ఇలాంటి తరహా వింత మరణం చోటుచేసుకుంది. బీటెక్ చదువుతున్న శ్రీ వర్షిణి అనే విద్యార్థి గో కార్టింగ్ ప్లే జోన్‌కి వెళ్లి జుట్టు చక్రాల్లో చిక్కుకోవడంతో ఎగిరిపడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ శ్రీ వర్షిణి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.