Hair Fall Solution: జుట్టు రాలడం తగ్గించుకోవడం సులువే..! ఇలా చేసి చూడండి..!! 

Share

Hair Fall Solution: చిన్న, పెద్ద ఇలా వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం.. ఈ సమస్య క్రమంగా మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.. జుట్టు రాలిపోతున్న కొద్ది చాలామంది నిరాశకు గురవుతుంటారు.. చాలామంది జుట్టు సమస్యలు తగ్గించుకునేందుకు కెమికల్స్ తో కూడిన కాస్మెటిక్స్, క్రీమ్స్ ను ఉపయోగిస్తున్నారు.. ఇది తాత్కాలికంగా పనిచేసినా శాశ్వతంగా పరిష్కారం ఉండదు.. కాబట్టి ఇలా కాకుండా సహజసిద్ధమైన చిట్కాలు పాటించండి.. జుట్టు ఊడిపోవటం, చుండ్రు సమస్య, పలుచగా ఉన్న జుట్టు కూడా ఒత్తుగా పెరగడం వంటి సమస్యలకు అద్భుతంగా పనిచేసే ఆయుర్వేద తైలం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Best Ayurvedic Hair Fall Solution:
Best Ayurvedic Hair Fall Solution:

Hair Fall Solution: ఆయుర్వేద తైలం తయారు చేసుకునే విధానం..!!

కావలసిన పదార్ధాలు :

గోరింటాకు రసం – 3 లీటర్లు, కలబంద గుజ్జు రసం – 3 లీటర్లు, ఉసిరికాయ రసం – 3 లీటర్లు, గుంటగలగరాకు రసం – 3 లీటర్లు, ఉల్లిపాయ రసం – 3 లీటర్లు, నాటు ఆవు పాలు – 3 లీటర్లు, కొబ్బరి బొండం నీళ్ళు – 3 లీటర్లు, కొబ్బరి నూనె – 3 లీటర్లు.

గోరింటాకు ఆకులను తీసుకుని మిక్సీ పట్టి దాని నుండి రసాన్ని తీసుకోవాలి. కలబంద తీసుకొని దానిపైన చెక్కు తీసి లోపల గుజ్జును చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టి రసాన్ని తీసుకోవాలి. తెల్ల పచ్చి ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసి ఉల్లిపాయ రసం తీసుకోవాలి. ఉసిరి కాయలు తీసుకొని వాటిలో ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వీటిని కూడా మిక్సీలో వేసి రసాన్ని తీసుకోవాలి. ఇలా రసం తీసిన గోరింటాకు, ఉల్లిపాయ, ఉసిరికాయ, కలబంద గుజ్జు ను ఒక బాండీలో వేసుకోవాలి.. అలాగే ఇందాక చెప్పుకున్నా కొబ్బరినూనె, కొబ్బరి బొండం నీళ్లు, నాటు ఆవు పాలు కూడా పోసి సన్నని మంట మీద మరిగించాలి..

నూనె మాత్రమే మిగిలి వరకు మరిగించిన తరువాత, ఆ నూనెను ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.. దీనిని తక్కువ మిశ్రమంలో కూడా తయారు చేసుకోవచ్చు. అయితే అన్నింటినీ సమపాళ్ళలో తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకొని తైలాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న నూనెను కేశ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.. ఈ తైలం ప్రతిరోజు రాసుకుంటే జుట్టు రాలకుండా ఉండడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, చుండ్రు సమస్య తగ్గి పోవడానికి, అందమైన కేశ సౌందర్యం కోసం ఈ తైలం అద్భుతంగా పనిచేస్తుంది. చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లోనే ఈ తైలం తయారుచేసుకుని మంచి ఫలితాలను పొందండి.

Best Ayurvedic Hair Fall Solution:
Best Ayurvedic Hair Fall Solution:

ఈ తైలం వాడుతూనే చిన్న చిన్న పొరపాట్లను చేయడం మానుకోండి.. అవేంటంటే వారానికి ఒక రోజు మాత్రమే తలస్నానం చేయకూడదు.. వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేయాలి.. ఇలా చేయడం వలన చుట్టూ అందమైన ఒత్తయిన జుట్టు మీ సొంతం అవుతుంది.. జుట్టు త్వరగా ఆరాలని హెయిర్ డ్రై ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు.. జుట్టు సహజంగానే ఆరబెట్టాలి. తల స్నానం చేసిన వెంటనే తలకు కాటన్, టర్కీ టవల్ చుట్టి ఉంచితే తలలో ఉన్న తేమను గ్రహించి త్వరగా ఆరేలా చేస్తుంది.. జుట్టు కి హెయిర్ స్ప్రేలు ఉపయోగించకూడదు. ఇందులో ఉన్న కెమికల్స్ జుట్టు పొడిబారేలా చేస్తుంది.. ఇవి పాటిస్తూ పైన తెలుపుకున్న తయారు చేసుకుని ప్రతిరోజూ వాడండి. ఒత్తయిన జుట్టు,  జుట్టు సమస్యల నుండి  బయటపడవచ్చు..


Share

Related posts

Corona Breaking: ఒక్క శ్మశానంలో ఇన్ని శవాలా..!? కాటిలో కన్నీరు తెప్పించే దారుణ కథలు..!!

Yandamuri

‘కమిటీ నివేదికల్లో అన్ని బయటకు వస్తాయ్’

somaraju sharma

కొడాలి నానికి గట్టి షాక్..! గుడివాడ అడ్డాలో భారీగా పేకాట – పోలీసుల దాడులు..!

Srinivas Manem