Cholesterol: కొలెస్ట్రాల్.. మనం తీసుకునే ఆహారంలో ఎంతో కొంత ఉంటుంది.. అలా అని కొవ్వు పదార్థాలు పూర్తిగా మానేయడం సరికాదు.. శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవాలి. కొన్ని సార్లు చెడు కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోకుండా ఉండటం సాధ్యం కాదు. కళ్ళు ఊరుకున్నా నోరు లాగించేయమంటుంది.. అలా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ను ఎదుర్కోంటున్నారా..!? అయితే మన వంటింట్లో ఉండే ఈ వస్తువులతో ఈ జ్యూస్ తాగండి చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! మరి ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..!!
పాలకూర 50 గ్రాములు, క్యాబేజీ 50 గ్రాములు, కీరదోసకాయ 100 గ్రాములు, వెల్లుల్లి 3 రెబ్బలు, పసుపు చిటికెడు, నిమ్మకాయ రసం ఒక స్పూన్. నిమ్మరసం తప్ప ఇప్పుడు చెప్పుకున్న పదార్థాలన్నింటిని కలిపి మిక్సీ పట్టాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్ లా తయారు చేసుకోవాలి. ఇక చివరిలో నిమ్మరసం కలపాలి. పైన చెప్పుకున్న క్వాంటిటీ లో తయారుచేసుకున్న జ్యూస్ మొత్తం ఒకేసారి తాగాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ రోజుకు ఒకసారి తాగాలి.
ఏదైనా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకున్నట్టు అనిపిస్తే వెంటనే ఈ జ్యూస్ తాగండి. పూర్తిగా కరిగిస్తుంది. కొలెస్ట్రాల్ లేని ఆహార పదార్థాలు సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి. వేయించిన ఆహార పదార్థాలు, నూనె ఎక్కువగా ఉపయోగించిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవటం తగ్గించాలి. ఒక వేళ కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకున్నట్లు అనిపిస్తే వెంటనే ఈ జ్యూస్ తాగండి సరిపోతుంది. నూరు శాతం ఫలితాలు కనిపిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అధిక బరువు, గుండె సమస్యలు తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.