Fruits: పండ్లను ఇలా తింటేనే ఆరోగ్యం..!! ఇలా అస్సలు తినకూడదు..!! 

Share

Fruits: పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన వరం.. ఆయా సీజన్లలో పండే పండ్లను తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.. ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు కచ్చితంగా తినాలి. పండ్లు తినడం ఆరోగ్యదాయకమైన కానీ వాటి యొక్క సుగుణం పొందాలంటే ఏం చేయాలి..!? అసలు పండ్లను ఎప్పుడు తినాలి..!? ఎప్పుడు తినకూడదు..!? నేరుగా పండ్లు తింటే మంచిదా..!? లేదంటే జ్యూస్ తాగడం మంచిదా..!? ఇప్పుడు తెలుసుకుందాం..!!

Best Time For Fruits: Eating
Best Time For Fruits: Eating

Fruits: పండ్లు ఇలా తింటే మంచిది..!!

మనం పండ్లను కనుక్కొని కట్ చేసుకుని లేదా డైరెక్ట్ గా తింటూ ఉంటాం.. భోజనం తర్వాత పండ్లు తినకూడదు. ఖాళీ కడుపుతో మాత్రమే తినాలి. పరగడుపున మాత్రమే పండ్లు తీసుకోవాలి. ఖాళీ కడుపుతో పండ్లను తినడం వలన శరీరంలోని అవయవాల పనితీరును ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

అధిక బరువుతో బాధపడే వారికి ఇవి చక్కటి బ్రేక్ ఫాస్ట్. ఏవైనా తిన్న తరువాత పండ్లను తింటే అవి పొట్టలోకి నేరుగా వెళ్ళడానికి ముందుగా మనం తిన్నది అడ్డుపడుతూ ఉంటాయి. అందుకని పరగడుపున లేదా ఆహారానికి ముందు పండ్లను తినాలి. కొంతమందికి కొన్ని కాయలు తినడం వలన కడుపులో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటికి కారణం అంతకు ముందు మనం తీసుకునే ఆహారమే. అదే మీకు ఏదైనా పండు తింటే పడకపోతే అటువంటి ఏ పండు అయినా సరే పరగడుపున తీసుకొని చూడండి. మీకు ఇంతకు ముందు బాధిస్తున్న సమస్యలు ఏవీ కూడా రావు..

Best Time For Fruits: Eating
Best Time For Fruits: Eating

Fruits: ఫ్రూట్స్ తింటే బోలెడు ప్రయోజనాలు..!!

పండ్ల రసాన్ని తాగితే తాజా పండ్ల రసాన్ని మాత్రమే తాగాలి. నిల్వ ఉన్న డబ్బాలు లేదా టెట్రా ప్యాకెట్ల నుంచి అసలు తాగవద్దు. పండ్ల రసం కంటే మొత్తం పండు తినడమే మంచిది. పండ్ల రసం తాగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. మూడు లేదా నాలుగు రకాల పండ్లను కలిపి జ్యూస్ గా చేసుకున్నప్పుడు మాత్రం కచ్చితంగా తాగటం మంచిదే. అదే పండు నమిలి తింటే ఫైబర్ కడుపులోకి వెళ్లి జీర్ణవ్యవస్థ కు మేలు చేస్తుంది. వారంలో మూడు రోజులు మీ డైట్ లో కచ్చితంగా గా వారంలో మూడు రోజులు పండ్లు తీసుకుంటే మీ శరీరంలో కలిగే మార్పులను మీరు గమనించవచ్చు. పండ్లలో అన్నిరకాల పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ప్రతి సీజన్లో దొరికే పండ్లను ఖచ్చితంగా సీజన్లో తినాలి.

స్ట్రాబెర్రీస్ తింటే వయసు పెరగకుండా ఉంటుంది. అరటి పండ్లు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. చెర్రీస్ పళ్ళు తింటే నరాలకు బలము కలిగిస్తుంది ద్రాక్ష పండ్లు తింటే రక్త ప్రసరణ కు మంచిది పైన్ ఆపిల్ తింటే ఆర్థరైటిస్ నొప్పులకు ఉపశమనం కలుగుతుంది బ్లూబెర్రీస్ తింటే ఎంతో మేలు చేస్తాయి బరువు తగ్గాలనుకునే వారు రోజూ పుచ్చకాయ తింటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనుకునేవారు నారింజపండు ను మీ డైట్ లో ఆడ్ చేసుకోవాలి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినాలి.. ప్రూట్స్ వలన కలిగే ప్రయోజనాలు.. ఎలా తినాలో తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి ఇలా ప్రయత్నించి చూడండి. చక్కటి ఫలితాలు పొందండి.


Share

Related posts

బ్లాస్టింగ్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్లో సిబిఐ హడావిడి !

Yandamuri

వైసిపి క్యాడర్ లో నిరాశ …ప్రజల్లో పేరాశ …వెరసి పాదయాత్రలు పేలవం!జగనన్న కు ఇదో కొత్త పాఠం!!

Yandamuri

భారత్ లో 74 వేలకు చేరిన కరోనా కేసులు

somaraju sharma