ప్రపంచపు అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లో సోమవారం చేసుకున్న నాటకీయ పరిణామాలు చాలా క్రేజీగా ఉన్నాయి. ప్రేక్షకులు నెటిజన్లు అందరూ నామినేషన్ ప్రక్రియ చోటుచేసుకున్న ట్విస్తులు చూసి నోరు వెళ్ళబెట్టారు. ఇది కదా బిగ్ బాస్ అంటే అని అంతా విపరీతంగా థ్రిల్ ఫీలయ్యారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…. ఇప్పటి వరకు ఇంటి లో ఒక వీక్ కంటెస్టెంట్ గా విమర్శలు ఎదుర్కొంటూ అసలు ఇంత దూరం ఎలా వచ్చింది అంటూ అందరిచేత అవమానపడ్డ మోనాల్ ఒక్కసారిగా ఇండియా వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియ లో దురదృష్టవశాత్తు అఖిల్, అభిజిత్, అవినాష్, అరియానా ఇరుక్కుపోయారు. అయితే మిగతా సభ్యులతో వారి కంటే బెటర్ అని నిరూపించుకొని నామినేషన్ నుండి బయటకు వెళ్లే అవకాశాన్ని బిగ్బాస్ కల్పించాడు. అప్పుడు అఖిల్ వెంటనే మోనాల్ ను టార్గెట్ చేశాడు. అయితే మాత్రం ఎవరూ ఊహించని విధంగా…. నువ్వు నాకు హెల్ప్ చేసినట్లు చెప్పుకోవడం సరికాదని ఆమె అఖిల్ కు షాక్ ఇచ్చింది.
వెంటనే కొన్ని పరిస్థితుల వల్ల అభిజిత్ ను నామినేషన్ నుండి. బయటకు పంపించింది ఆమె వెళ్లి తన నామినేషన్ లో నిలిచింది. అఖిల్ కు వెంటనే మైండ్ పనిచేయలేదు కాబోలు మోనాల్ అలా చేసినప్పటి నుండి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆల్రెడీ మోనాల్ అఖిల్ కు త్యాగం చేసింది. ఇప్పటివరకు అఖిల్ ఆమెకు ఏమీ చేయలేదు…. పైగా రెండవ సారి ఆమెను త్యాగం చేయాలని కోరుతున్నాడు అని నెటిజన్లు అఖిల్ పైన ఫైర్ అవుతున్నారు. ఇక అభిజిత్ అభిమానులైతే మోనాల్ కే తీవ్రంగా మద్దతు ఇస్తున్నారు
ఇప్పటికే ఒకసారి అఖిల్ కు ఇమ్యూనిటీ లభించింది. అది అతను తీసుకున్న రిస్క్ వల్ల కావచ్చు కానీ బిగ్ బాస్ నుండి చివాట్లు తిన్నాడు. మోనాల్ వీక్ కంటెస్టెంట్ అని అతనికి తెలుసు పైగా అతనికి మోనాల్ అంటే ఇష్టం నిజంగా ఉంటే మోనాల్ తనకోసం త్యాగం చేసి ఎలిమినేట్ అయిపోతే….? అఖిల్ కి మోనాల్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆమెను నామినేషన్ లో ఉంచడం ఎందుకు? ఆదివారం ఏడవడం ఎందుకు అని అఖిల్ ను ప్రశ్నిస్తున్నారు. మోనాల్ కి మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు గేమ్ మొదలు పెట్టావు అని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి మోనాల్ గజ్జర్ హైలైట్ గా నేషనల్ స్థాయి లో ట్రెండ్ అయింది. అంటే ఇక ఆమె ఎలిమినేషన్ నుండి సేవ్ అయినట్లేనా?
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!