లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి సినిమాలకు మరియు ఎంటర్టైన్మెంట్ కు మొహం వాచిపోయిన ప్రేక్షకులందరినీ అలరించేందుకు దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్-4 ముస్తాబవుతోంది. గత మూడు సీజన్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోట్లాది ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ షో ఈ సారి ఈ లాక్ డౌన్ వల్ల మరింత ప్రజాదరణ పొందవచ్చని అందరూ అంచనా వేస్తున్నారు.
ఈసారి సీజన్ కు హోస్ట్ గా మళ్ళీ అక్కినేని నాగార్జుననే తీసుకోబోతున్నారు అని కొంతమంది అంటుంటే తొలిసారి వినూత్నంగా స్టార్ హీరోయిన్ అయిన అక్కినేని సమంత కు ఈ ఆఫర్ వెళ్లినట్లు కూడా మరి కొందరు చెబుతున్నారు. అయితే కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఈసారి ఎంతో మంది ప్రముఖు ఆర్టిస్టులను మరియు క్రేజీ క్యాండిడేట్స్ ను తీసుకునేందుకు బిగ్ బాస్ టీం సన్నాహాలు చేస్తోందని వార్తలు వచ్చేశాయి.
లాక్ డౌన్ వల్ల కొద్దిగా ఫ్రీగా ఉన్న మీడియం సైజ్ సెలబ్రిటీలు అయినా బిత్తిరి సత్తి, యాంకర్ వర్షిణి వంటి వారిని ఎలాగైనా కంటెస్టెంట్స్ లిస్టులో చేర్చాలని బిగ్ బాస్ టీం చూస్తుండగా ఇప్పుడు కొత్తగా మరొక పేరు తెర మీదకు వచ్చింది.
యాంకర్ గా తన అందాలతో మరియు అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను పొందిన అనసూయ సినిమాల్లో కూడా తనదైన శైలిలో మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని లక్షలు ఇచ్చి అయినా అనసూయను బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా తీసుకొని రావాలని భావిస్తున్నారట. క్రితం సారి యాంకర్ శ్రీ ముఖి షో కి తెచ్చిన క్రేజ్ మరియు సందడి అంతా ఇంతా కాదు.
అందుకే అనసూయ, వర్షిణి వంటి చలాకి అమ్మాయిలతో…. అదిరి పోయే అబ్బాయిలతో ఒక మంచి మేళవింపుతో అందుకు తగ్గట్లు లిస్టు ఎంపిక చేస్తే ఈసారి టిఆర్పి రేటింగ్స్ భారీ స్థాయిలో వస్తాయని వారి ఆశ. మరి అనసూయ అందరిని ఎంటర్టైన్ చేసేందుకు ఎన్ని లక్షలు తీసుకుంటుందో చూడాలి.