బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత ఎంతోమంది కంటెస్టెంట్ లు ఊహించని క్రేజ్ అందుకున్నారు. ఫైనల్ కు వచ్చిన వారే కాకుండా తమ ఆటతీరు తో ఆకట్టుకున్న ప్రతి ఒక్కరూ భారీ పాపులారిటీ సంపాదించారు. ఇక అలాంటి వారికి సినిమా ఛాన్సులు కూడా బాగానే వస్తున్నాయి. ఇక ఫైనల్స్ రోజున మెగాస్టార్ వారికి ఎలాంటి వరాలు ఇచ్చారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియా లో అతను చేసిన సినిమాల పై వస్తున్న రూమర్స్ అన్నింటిని మెగాస్టార్ ఒకే ఒక్క మాతో తేల్చి పడేస్తాడు.
సోహెల్ చేయబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని చిరు వాగ్దానం చేశాడు. ఇక బిగ్బాస్ ఇంట్లో మరో కంటెస్టెంట్ కు కూడా ఆఫర్ ఇవ్వడం మనకు తెలిసిందే. తాజాగా మరో మెగా హీరో సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ నటిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వకీల్ సబ్ షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చేయనున్నాడు. అతనికి మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే వాటిలో ఒక సినిమాలో ఈ బిగ్బాస్ బ్యూటీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందట.
ఇక ఆ కంటెస్టెంట్ దివి కావడం గమనార్హం. ఇప్పటికే మెగాస్టార్ వేదలం రీమేక్ లో దివి ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ… మొత్తానికి ఈ అమ్మడుకి మాత్రం సినిమా ఆఫర్లు గట్టిగానే వస్తున్నాయట. మరి వాటిని అందిపుచ్చుకొని ఈమె ఎంత వరకు గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.