బిగ్ బాస్ షో అంటేనే మసాలా కి కేరాఫ్ అడ్రస్. ఒక లవ్ కావచ్చు.. వైరం కావచ్చు.. లేదా నటనే కావచ్చు. ఏదైనా బిగ్ బాస్ హౌస్ లో దేనికీ హద్దు లేదు. ఈ షో మూడవ సీజన్ లో పునర్నవి-రాహుల్ జంట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి స్నేహమా? ప్రేమా? లేదా స్నేహం కంటే ఎక్కువ ప్రేమ కంటే తక్కువా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆడియన్స్ మదిలో మెదిలాయి.
గతంలో వీరిద్దరూ కలిసి ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్టైన్ చేశారు. ప్రేక్షకులను తమ కెమిస్ట్రీ తో కట్టి పడేసారు. చివరికి రాహుల్ సిప్లిగంజ్ 3వ సీజన్ విన్నర్ గా కూడా అవతరించారు. ఇక నాలుగో సీజన్లో కూడా లా ఒక జంట బయటకు వస్తున్నట్లు కనిపించింది. కంటెస్టెంట్ లు రాహుల్ పునర్నవి ఫార్ములాను వాడాలని ప్రయత్నిస్తున్నారు ఏమో మొదటి నుండి బాగానే లవ్ ట్రాక్ లు నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరు అమ్మాయిలతో పులిహోర కలిపేందుకు చాలా ట్రై చేస్తున్నారు.
అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ వారితో సన్నిహితంగా ఉండే పనిలో పడ్డారు. ఇక ఈ సీజన్ లో మొదటి నుండి మన్మధుడిలా అభిజిత్ కనిపిస్తున్నాడు. హౌస్ లోకి రావడం తోనే నాగార్జున హారికతో అతనికి లింక్ పెట్టేసాడు. అయితే అతను మోనాల్ తో బాగా క్లోజ్ అయ్యాడు. తర్వాత తనతో గొడవలు వచ్చాయి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్వాతి కూడా అభిజిత్ తో ఎక్కువగా ఉంటుంది.
ఇదే సమయంలో ఎంతమందితో ఎలా ఉన్నా కూడా హారిక తో అతనికి ఉన్న రిలేషన్ షిప్ వేరే లెవెల్. అభిజిత్ కు హారిక ఎప్పుడూ అండగా నిలుస్తుంది. అభి కోసం హారిక వాగ్వాదానికి దిగుతుంది. స్వాతి తో కలిసి అభిజిత్ సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన హారికకు తాను అలా చేసినందుకు సారీ చెప్పాడు. నిన్నటి ఎపిసోడ్ లు జైల్ ఏరియాలో సీతాకోకచిలక ను హారిక గమనిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అభిజిత్ భయపెట్టేసరికి ఉలిక్కిపడింది. వెనకాల నుండి వచ్చిన అభిజిత్ ఆమె పై చేతులేశాడు..! అంతే తర్వాత ఇద్దరూ గుడ్ నైట్ చెప్పుకున్నారు. ఈ సీన్ ప్రేక్షకులకు ఎన్నో ప్రశ్నలను వదిలేసింది.