బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం రసవత్తరంగా మారింది. 5 వారాలు కంప్లీట్ అయి ఆరో వారం లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది సీజన్ ఫోర్. ఇదిలా ఉండగా ఆరో వారంలో ఇంటిలో ఉన్న సభ్యులకు అదిరిపోయే టాస్క్ బిగ్ బాస్ ఇచ్చారు. అదేమిటంటే హౌస్ లో ఉన్న కుమార్ సాయిని తను ఒంటి మీద ఉన్న దుస్తులను ఉన్న పట్టుగా కట్ చేసుకోవాలి అని బిగ్ బాస్ చెప్పడంతో వెంటనే కుమార్ సాయి… ఒంటి మీద ఉన్న దుస్తులను ముక్కలు ముక్కలుగా కత్తిరించేశాడు.
అభిజిత్ తను సూట్ కేసులో ఉన్న దుస్తులను త్యాగం చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక అమ్మాయిల విషయంలో అయితే దేత్తడి హారిక కి అదిరిపోయే షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఉన్న జుట్టు మెడ దాకా కత్తిరించు కోవాలి అని అన్నారు. దీంతో హారిక నేను దీనికి అంగీకరించను..అని అన్న గాని చివరాకరికి హారిక ఒప్పుకోవడం జరిగింది.
హౌస్ లో రాకముందు తన అన్నయ్య జుట్టు విషయంలో వార్నింగ్ ఇచ్చాడు.. అని తెలిపిన హారిక కత్తిరిస్తున్న సమయమున సారీ అన్నయ్య అంటూనే బిగ్బాస్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేసింది. హైర్ కట్ అవ్వడంతో గట్టిగా కూడా ఏడ్చింది హారిక. మొత్తంమీద మంగళవారం జరగబోయే ఎపిసోడ్ లో రకరకాల వెరైటీ టాస్క్ లు ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చినట్లు అర్థం అవుతోంది.