బిగ్ బాస్ రియాల్టీ షో చివరి దశకు చేరుకుంది. సోమవారం జరిగే నామినేషన్ ప్రక్రియ ఈ సీజన్ కి చివరిది కావటంతో.. హౌస్ లో సభ్యులు ఏ పాయింట్ మీద ఇతరులను నామినేట్ చేస్తారు అనే విషయంలో ఆడియన్స్ లో సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుతం ఇంటిలో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీంతో టాప్ ఫైవ్ లో కి ఎవరు వెళ్తారు అన్నది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఆల్ రెడీ అఖిల్ ఫైనల్ “టికెట్ టూ ఫినాలే టాస్క్” మెడల్ గెలవడంతో.. ఈ వారం నామినేషన్ నుండి తప్పించుకొని ఫైనల్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా సోమవారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. హౌస్ లో ప్రతి ఒక్కరికి రాజు పొజిషన్ ఇస్తూ మంత్రిగా అఖిల్ ని పెట్టి అందరి చేత బిగ్ బాస్ గేమ్ ఆడిస్తున్నట్లు కనబడుతోంది. ఇటువంటి తరుణంలో హౌస్ లో హారిక రాజు పాత్రలో ఉన్న సమయంలో.. సోహెల్ తో గొడవ అయినట్లు తెలుస్తోంది. గతంలోనే వీరిద్దరి మధ్య రెండు సార్లు భారీగా గొడవ జరగడంతో పాటుగా నువ్వానేనా అన్నట్టుగా మాట్లాడుకుంటూ బూతులు కూడా మాట్లాడే పరిస్థితి సీన్ క్రియేట్ అయింది.
ఇంత లేవు పొట్టిదాన అన్నట్లు హారిక పై సోహెల్ వేసిన వేసిన డైలాగులు.. అప్పట్లో సంచలనం అయ్యాయి. అయితే తాజాగా హారిక అభిజిత్ బట్టలు స్విమ్మింగ్ పూల్ లో పడవేయటంతో సోహెల్.. హారిక పై అదేవిధంగా అఖిల్ పై సీరియస్ అయిపోయాడు. బరాబర్ నేను ఇలానే ఉంటాను… అంటూ వాళ్లు చేసిన పనికి.. హౌస్ లోకి వెళ్లి కుర్చీ నేలకేసి కొట్టడం ప్రోమోలో కనబడటం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ ప్రోమో చూసిన బిగ్ బాస్ ఆడియన్స్ మళ్లీ వీరిద్దరి మధ్య గొడవ అయిందా..? అంటూ తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు.