Big Boss : బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ లు సెలక్షన్ స్టార్ట్ అయిపోయింది..? ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్..??
Big Boss : బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంప్లీట్ అయ్యి రెండు నెలలు కూడా కాకముందే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ ల లిస్ట్ రెడీ చేయడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు టాక్ వస్తోంది. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ యూట్యూబ్ అధికారిక ఛానల్ లో నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ త్వరగా రావాలని కోరుకుంటున్నారా అని పోల్ నిర్వహించగా అనూహ్యమైన రెస్పాండ్ వచ్చినట్లు, దీంతో “స్టార్ మా ఛానల్” బిగ్బాస్ 5 సీజన్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీజన్ ఫైవ్ లో హౌస్ లోకి మొట్టమొదటి కంటెస్టెంట్ సెలక్షన్ కూడా షో నిర్వాహకులు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా ఎంతో గుర్తింపు దక్కించుకున్న షణ్ముక్ ని తాజాగా బిగ్బాస్ నిర్వాహకులు సెలక్ట్ చేసినట్లు టాక్. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ సినిమా రాకముందు అనేక వెబ్ సిరీస్ లో నటించిన షణ్ముఖ పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ ఎప్పుడైతే ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ అనే సూపర్ వెబ్ సిరీస్ వచ్చిందో దాని ద్వారా మంచి ఆదరణ ప్రేక్షకుల్లో దక్కించుకున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ దక్కించుకోవడంతో తాజాగా షో నిర్వాహకులు షణ్ముక్ ని బిగ్ బాస్ షో లో మొదటి కంటెస్టెంట్ గా తీసుకున్నట్లు సమాచారం.