25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : ముక్కు అవినాష్ కి అద్భుతమైన ఛాన్స్ ఇచ్చేసిన బిగ్ బాస్! ఇక వదులుతాడా…?

Share

బిగ్ బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. హౌస్ మేట్స్ మధ్య వివాదాలతో టాస్క్ లోని ఎంటర్టైన్మెంట్ పిక్స్ కు చేరుకుంది. గతవారం నుండి పూర్తిగా టాస్క్ లో మునిగి పోయిన హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా కొంచెం వెరైటీ అనుభూతిని కలిగించాలని బిగ్బాస్ నిర్వాహకులతో సభ్యులందరికీ ఫ్యాషన్ షో కాంటెస్ట్ నిర్వహించింది. ఇందులో ప్రతి ఒక్కరూ అదిరిపోయే డ్రెస్సులతో స్టేజి పైన వయ్యారాలు పోయారు. 

 

ముఖ్యంగా దివి, మోనాల్, హారిక లు అయితే ఎక్స్ ప్రెషన్ తో చంపేశారు. అరియానా గ్లోరీ తనదైన శైలిలో హాట్ గా డ్రెస్ అయింది. అటువైపు నోయల్, అఖిల్, మెహబూబ్ దిల్ సే, సోహెల్ కూడా తమ పర్సనాలిటీని చూపించారు. దాని తర్వాత బిగ్ బాస్ ముక్కు అవినాష్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. హౌస్ లోని ప్రతి ఒక్కరికి అద్దంలా అవినాష్ వ్యవహరించాలని బిగ్బాస్ సూచించారు. అంతే…. అవినాష్ ఒక కుర్చీలో కూర్చుని ఎదురుగా వచ్చే ప్రతి అమ్మాయి తో పులిహోర కలపడం మొదలు పెట్టాడు. 

మొదటిగా మోనాల్ కి కుర్చీ ని మరింత దగ్గరగా జరుపుకొని ఈ సందర్భం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను బిగ్బాస్ తనకు సరైన అవకాశం ఇచ్చాడని చెప్పడం గమనార్హం. పెళ్ళైపోయిన లాస్య ను వెక్కిరించిన అవినాష్ తన కామెడీతో హారిక, అరియానా లను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు. దిచి కి లిప్ స్టిక్ ఎక్కువైంది అని చెప్పి ఆమె పెదాల తో సరిచేసుకుంటే.. నీకు తినమని చెప్పలేదు అని అన్నాడు. అరియానా రాగానే ఇక్కడ నుండి అద్దం వెళ్లిపోతుంది అంటూ ఆటపట్టించాడు. అందరినీ అలా ఆడుకున్న అవినాష్ ముక్కుని మాత్రం గంగవ్వ కామెడీ చేయడం విశేషం.


Share

Related posts

ఇది అఫీషియలా అంటున్న బాలయ్య ఫ్యాన్స్ …?

GRK

YS Jagan: జగన్ సీక్రెట్ పాలిటిక్స్..!

Srinivas Manem

GooseBerry: ఉసిరికాయ  ను  ఆదివారం ఎందుకు తినకూడదో తెలుసా??కారణం తెలిస్తే  ముట్టుకోరు!!

siddhu