Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఎంతగానో ఆశగా వెయిట్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో సినిమా ధియేటర్లు క్లోజ్ అయిపోవడంతో.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు బిగ్ బాస్ షో మొదలైతే బాగుంటుంది అని సోషల్ మీడియాలో తెగ డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లో కూడా రద్దు అవటంతో.. సరైన ఎంటర్టైన్మెంట్ సినిమాల పరంగా.. టీవీ షోల పరంగా పెద్దగా లేకపోవడంతో.. సీజన్ ఫైవ్ ఎప్పుడు మొదలవుతుందో అంటూ చాలా మంది ఇది ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సారి సీజన్ లో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ప్రయత్నాలు చేయటం స్టార్ట్ చేశారట. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వర్చువల్ విధానం ద్వారా కంటెస్టెంట్ లను సెలెక్ట్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ అయినట్లు సమాచారం. దీంతో ఇటీవల సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 5 జులై చివరి మాసంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అవుతున్న ట్లు వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.
Read More: Big Boss: నలుగురు ప్రాణాలను కాపాడిన బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్..!!
అయితే వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సెప్టెంబర్ మొదటి వారంలో సీజన్ ఫైవ్ లోగో.. ప్రోమో రిలీజ్ అవుతుందని.. సెప్టెంబర్ మూడో వారం నుండి .. సీజన్ ఫైవ్ స్టార్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో జూలై చివరి మాసం ..ఆగస్టు ప్రారంభంలో షో ప్రారంభం అవుతుంది అన్న వార్తల్లో వాస్తవం లేదని తాజా వార్తలతో తేలిపోయింది. సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేసి ఏకధాటిగా డిసెంబర్ వరకు దాదాపు 100 రోజుల పాటు.. నిర్వహించే ఆలోచనలో బిగ్ బాస్ షో నిర్వాహకులు సీజన్ ఫైవ్ ని ప్లాన్ చేసినట్లు టాక్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?