Corona : ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కి విరుగుడు కరోనా వ్యాక్సిన్ చాలా దేశాలలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయినా గాని కరోనా విజృంభన ని ఎవరూ ఆపలేక పోతున్నారు. దాని ఆకారం రకరకాలుగా మార్చుకుంటూ మనిషిలో ప్రవేశిస్తూ విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కి తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది.
గమ్మత్తు ఏమిటంటే ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయినా కానీ ఆయనకు కరోనా మళ్లీ ఎలా ఎటాక్ అయ్యింది అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారింది. దేశ ప్రధాని కి వ్యాక్సిన్ వేయించుకున్న గాని .. మళ్లీ కరోనా సోకడంతో .. వ్యాక్సిన్ పై జనాలకి నమ్మకం పోతుంది. ఈ వార్త అంతర్జాతీయంగా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవలె భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ కి కరోనా వ్యాక్సిన్ లు పంపటం జరిగింది. ఒక్క భారత్ మాత్రమే కాక చాలా దేశాలు పేద దేశాలకు వ్యాక్సిన్ లు పంపిస్తున్నారు.