NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Krishnapatnam Corona Medicine: బిగ్ బ్రేకింగ్.. కృష్ణపట్నం చేరుకున్న ఐసిఎంఆర్ టీమ్..!!

Krishnapatnam Corona Medicine: ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో కృష్ణపట్నం పేరు మార్మోగిపోతోంది.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు కృష్ణపట్నం బొరిగి ఆనందయ్య ఉచితంగా మందును అందిస్తున్నారు.. ఆనందయ్య కు ఆయుర్వేదం పై ఉన్న పట్టుతో ఆయన ఈ మందును కనిపెట్టారు.. ఈ విషయం పై సీఎం జగన్ దృష్టి సాధించారు.. అధ్యాయనం ప్రారంభించాలని ఆయుష్ కు ఆదేశం ఇచ్చారు.ఈ విషయం గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఐసీఎంఆర్ డైరెక్టర్ తో మాట్లాడారు.. వీలైనంత త్వరగా రిపోర్ట్ వచ్చేలా చూడాలని ఐసీఎంఆర్ ను ఆదేశించారు.. అలాగే ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు అధ్యయనం చేయడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ టీమ్ అక్కడకు చేరుకుంది..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే కృష్ణపట్నం చేరుకుంది.. బొరిగి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పై రీసెర్చ్ చేయనుంది.. ఈ మందులో మిరియాలు, పిళ్ళెళ చెక్క, పసుపు, జాజికాయ, తేనె, నల్ల జీలకర్ర, పట్టా, నేల ఉసిరి, గుంటగరగరాకు వంటి మూలికలు ఉపయోగిస్తున్నారు అని తెలుస్తోంది.. అయితే ఇవే కాకుండా ఇంకేమైనా మూలికలు రహస్యంగా కలుపుతున్నారా..!? ఈ మందును కళ్ళల్లో వేస్తున్నారు.. దీనివలన ఆ మందు తీసుకుంటే ప్రజలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..!? వంటి విషయాలను రెండు రోజుల పాటు ఉండి గమనిస్తారు.. అలాగే అక్కడికి వచ్చి మందు తీసుకుంటున్న వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు.. అలాగే ఈ మందు ఇంత బాగా పని చేస్తున్నప్పుడు ఎందుకు అలోపతిలో తయారు చేయలేదు..!? వంటి విషయాలపై అధ్యయనం చేయనున్నారు ఐసీఎంఆర్ టీం.

Big Breaking Krishnapatnam Corona Medicine: ICMR Team reached
Big Breaking Krishnapatnam Corona Medicine ICMR Team reached

ఆనందయ్య కరోనాకు మందు ఇస్తున్నారని తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు అక్కడ మందు పంపిణీ నిలిపివేశారు. అయితే ఆయుష్ ల్యాబ్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు వచ్చిన రిపోర్టుల ప్రకారం మందులు హానికరం కాదని తేలింది. అయితే ఈ మందు అన్ని ప్రమాణాలకు లోబడి ఉందని ఆ రిపోర్టులో స్పష్టం చేశారు.. ఇంకొన్ని రిపోర్టుల కు రెండు రోజులు పట్టవచ్చు. అయితే ఈ మందు పై ప్రజలు నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో.. శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మళ్లీ మందు పంపిణీ ప్రారంభించారు.. తాజాగా ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఆయుష్ స్పష్టం చేసింది.. ఐసీఎంఆర్ అధ్యయనం చేసి ఈ నాటువైద్యం పై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే.. ఈ మందు వేయడానికి కేంద్రం అంగీకరిస్తే ఆయుర్వేద పరంగా కరోనాను కట్టడి చేయవచ్చు..

author avatar
bharani jella

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju