ట్రెండింగ్

Ola Electric Scooter’s: ఓలాకి బిగ్ షాక్..పేలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ల దాటికి.. చేతులెత్తేసిన యాజమాన్యం..??

Share

Ola Electric Scooter’s: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ లు మార్కెట్లోకి తీసుకు వచ్చి భారీ స్థాయిలో అమ్మిన కంపెనీ ఓలా. గత ఏడాది సెప్టెంబర్ 15 వ తారీకున ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ‘ఓలా ఎస్1, ఎస్1ప్రో’ ఎలక్ట్రిక్‌ స్కూటర్ను రిలీజ్ అయ్యాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వెయ్యి కోట్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ కూడా చాల గొప్పగా .తెలియజేయడం జరిగింది. భారతీయ ఈ కామర్స్ లో ఇది చరిత్ర అని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే గొప్పలు చెప్పుకున్న తగ్గ రీతిలో బయట ఎలక్ట్రిక్ వాహనాల పనితీరు లేదు. రిలీజ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ లలో అనేక లోపాలు బయటపడటంతో కొనుగోలుదారులనుండి  కంపెనీకి చెడ్డ పేరు రావడం జరిగింది.

Big shock to Ola..beyond exploding electric scooters .. hand-picked ownership

ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేసి ఇళ్లల్లో చార్జీలు పెడుతుంటే ఉన్నటువంటి బ్యాటరీలు పేలిపోయి… ఇంటిలో ఉన్న మనుషులు చనిపోయి.. మరికొంతమంది హాస్పిటల్ పాలయి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి.. అనేక ఫిర్యాదులు కేంద్రానికి కూడా వెళ్లాయి. అయినా గాని ఎలక్ట్రిక్ వెహికల్స్ రోజురోజుకీ పెలిపోవడంతో ఓలా కంపెనీ పై ఒత్తిడి ఉన్న కొద్ది పెరిగిపోతుండటంతో.. ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం కూడా చేతులెత్తేసినట్లూ వార్తలు వస్తున్నాయి.

 

ఉన్నకొద్దీ  కొనుగోలుదారుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో… పాటు ప్రభుత్వ ఒత్తిడి కూడా ఉంటూ ఉండటంతో…ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్వయం సౌరభ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గౌరవ్ పోర్వాల్, హెచ్‌ఆర్ హెడ్ రోహిత్ ముంజాల్, జనరల్ కౌన్సెల్ సందీప్ చౌదరిలు ఆ సంస్థకు ఇప్పటికే గుడ్‌ బై చెప్పటం జరిగింది. ఇప్పుడు తాజాగా ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వరుణ్ దూబే కూడా గుడ్ బై చెప్పారు. ఈయనతోపాటు cto దినేష్ రాధ కృష్ణ కూడా కంపెనీకి వ్యక్తిగత కారణాలు తెలియజేస్తూ నిష్క్రమించారు. దీంతో చాలా వరకు సంస్థకు చెందిన ఉన్నత స్థాయి సిబ్బంది.. ఒక్కొక్కరు జారుకుంటూ ఉండటంతో ఓలా సీఈవో బనిష్ అగర్వాల్..కి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజా పరిస్థితులతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లు పేలుడు ధాటికి.. ఇక యాజమాన్యం కూడా చేతులెత్తేసినట్లే అనే టాక్ బయట బలంగా వినబడుతోంది.


Share

Related posts

‘బెల్లం టీ’తో ఎంత ఆరోగ్యమో తెలుసా?

Teja

Monal Gajjar : వామ్మో.. ఏంది మోనల్ గజ్జర్.. డ్యాన్స్ తో అదరగొట్టేశావుపో?

Varun G

Bigg boss 4 : అఖిల్ ను బుక్ చేసేశారు.. అమ్మాయిలందరికీ పులిహోర కలుపుతున్నాడట..?

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar