బిగ్ బాస్ 4 : మోనాల్ ని పాపం ఏమంటున్నారో చూడండి..! అలా చేస్తే ఇలాగే అంటారట

Share

నిన్నటి నామినేషన్ ప్రక్రియ లో జరిగిన గొడవతో ఐదో వారం బిగ్ బాస్ షో చాలా రసవత్తరంగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు అటుఇటుగా ఊగిసలాడుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ కి ముగింపు కార్డు పడేది ఖాయంగా కనిపిస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో అభిజిత్, అఖిల్ ల మధ్య మోనాల్ ఇష్యూ హాట్ టాపిక్ అయిపోయింది. ఇంటిలోని ప్రతి ఒక్కరు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాలని బిగ్బాస్ తెలిపారు. అలాగే అందుకు తగిన కారణాలను కూడా వివరించారని చెప్పారు.

 

నామినేట్ చేస్తున్న వారు కారణాలు చెబుతున్నప్పుడు అవతలివారు వాదించడం.. దాంతో ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బ తిని ఒక టాపిక్ నుంచి మరొక టాపిక్ దగ్గరికి వెళ్లడం చేతులు చూపించుకొని అరుచుకోవడం…. మాట్లాడుకోవడం తో నిన్న ప్రేక్షకులు ఫుల్ గా ఎంటర్టైన్ అయ్యారు. అభిజిత్- అఖిల్ మధ్య గొడవ అయితే హైలైట్ అని చెప్పాలి. అరేయ్.. రేయ్ అనే పిలుపు అలా అఖిల్ తనను అలా పిలవడం తనకు నచ్చలేదని అభిజిత్ చెప్పాడు. ఈ విషయంలో కొంచెం సిల్లీగా అనిపించినా అభి కూడా కరెక్ట్ గా పాయింట్ మాట్లాడే సమయానికి అఖిల్ మోనాల్ విషయాన్ని మధ్యలోకి లాగేసాడు.

ఒక అమ్మాయి గురించి నువ్వు చెడుగా చెబుతున్నావు అని ఆమెను బయటకు లాగడంతో ఆ గొడవ కాస్త తారాస్థాయికి చేరింది. ఆ మేటర్ నీకెందుకు అది మేము మేము చూసుకుంటాం నువ్వు అసలు తనకు ఏమి అవుతానని అభిజ్జిత్ ఎదురు ప్రశ్నించాడు. అయితే నామినేషన్ లో జరిగిన గొడవ నేషనల్ ఛానల్ మొత్తం చూస్తుంది అని మోనాఅల్ ఒక్కసారిగా ఏడ్చి గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. నా పరువు పోతుంది మీరు నన్ను మీ గొడవ లోకి లాగొద్దు అని ప్రాధేయపడింది.

మోనాల్ కి ఈ విషయం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని కామెంట్ చేస్తున్నారు. అభి-అఖిల్ ఇద్దరి తో సన్నిహితంగా ఉండడం అక్కడ లేకపోతే ఇక్కడ…. ఇక్కడ లేకపోతే అక్కడ గేమ్ ఆడుతోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇద్దరినీ ఇలా దూరం చేయడం ఎందుకు…. ఏదైనా ఉంటే ముగ్గురు ఒకచోట కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించకుంటే సరిపోతుంది కదా…. ఇక్కడ టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని.. మోనాల్ అంతా తన చేతులారా చేసుకుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి..?


Share

Related posts

సీఎం వైఎస్ జగన్ తో పంచాయతీ ఉన్నతాధికారుల భేటీ..ఎందుకంటే..!!

somaraju sharma

టోటల్ ఇండియా వైడ్ గా అదిరిపోయే రికార్డ్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ..!!

sekhar

Job update: డబ్యూడీసీడబ్యూ నోటిఫికేషన్..!!

bharani jella