జబర్దస్త్.. తెలుగు బుల్లితెరలో టాప్ ర్యాంకులో దూసుకుపోతున్న కామెడి షో. ఈ షోకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ షోను ఇష్టపడతారు. అందులో కామెడియన్లు వేసే పంచులు, రోజా చెప్పే మాటలు అంటే ఎంతోమంది ఇష్టం. అందుకే ఈ షోను చూసి పలు ఛానెల్స్ కొత్త కొత్త కామెడి షోలను నిర్వహిస్తున్నాయి. కానీ ఈ షోకు వచ్చినంత రెస్పాన్స్ రాకపోవడంతో మధ్యలోనే ఆ షోలు మాయమవుతున్నాయి.
అయితే ఈ షో కంటే ఎక్కువ క్రేజ్ ఏ షోకు అయినా ఉందంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. బిగ్ బాస్ షో కోసం వేచి చూసే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ షో చివరి దశకు రావడంతో మరింత ఉత్కంఠంగా సాగుతోంది. ఇందులో ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆటను మంచిగా ఆడుతుండటంతో ఎవరు గెలుస్తారో చివరి వరకు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితే ఇప్పడు జబర్దస్త్ ను రెండుగా చీలుస్తోంది. ఈ చీలికలో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచి చూడాలి.
బిగ్ బాస్ హౌజ్ నుంచి ఈ వారం అవినాష్ ఎలిమినేట్ అవుతుండే… కానీ ఏవేక్షన్ పాస్ సాయంతో ఎలిమినేషన్స్ నుంచి అతను తప్పించుకున్నాడు. కామెడీ కార్డు, సింపతీ కార్డు ఇలా పలు కార్డులను ఇప్పటివరకు వాడుకుంటూ అవినాష్ బిగ్ బాస్ లో కొనసాగుతున్నాడు. అయితే అవినాష్ కు తన మాజీ షో జబర్దస్ నుండి మంచి మద్దతు లభిస్తోందని చెప్పాలి. ఇప్పటికే అవినాష్ ను సపోర్ట్ చేస్తూ రాకేష్, గెటప్ శ్రీనులు అతనికి ఓటు వేయాలని పలు పోస్ట్ లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే జబర్దస్త్ కమెడియన్స్ లో కొందరు అవినాష్ కు మద్దుతు తెలుపుతుంటే మరికొందరూ అభిజిత్ కు మద్దతు తెలుపుతున్నారు. అభిజిత్ విన్నర్ అవ్వాలంటూ పోస్ట్ లు చేస్తున్నారు. జబర్దస్త్ కామెడియన్ అయిన భాస్కర్ అవినాష్ గెలిస్తే బావుంటుంది అని అంటూనే.. అభిజిత్ గేమ్ బాగా ఆడుతున్నాడని తెలుపుతున్నాడు. అలాగే అభిజిత్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాడు. ఇలా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ అటు అవినాష్, ఇటు అభిజిత్ వైపు మొగ్గు చూపుతున్నారు.
బిగ్ బాస్ లో అవినాష్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదని కొంతమంది కమెడియన్స్ పలు కామెంట్ చెయ్యడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చివరకు నాగబాబు కూడా అవినాష్ ను వదిలేసి అభిజిత్ కు సపోర్ట్ చేయడం చూస్తే.. జబర్దస్త్ రెండుగా చీలిపోయిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!