బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ కి వెళ్లే వారి లో వినపడుతున్న పేర్ల లో ఒక పేరు సోహెల్. ఇంటిలో ముందు నుండి చాలా జెన్యూన్ గేమ్ ఆడుతున్నాడు అని… ఫెయిర్ గా మనసులో ఉన్నది ఉన్నట్లు బరాబర్ చెప్పేస్తున్నాడు అని సోహెల్ ఆటతీరుపై సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు.
హౌస్ లో ఫస్ట్ టైం ఇంటి లోకి ఎలా వచ్చాడో అదే విధంగా ఇప్పటికీ అలాగే ఉన్నాడు అని.. ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో కి వెళ్ళటం గ్యారెంటీ అని… ప్రారంభంలో ఉన్న ఆవేశం కూడా తగ్గించుకోవడం కూడా అతనికి ఇప్పుడు చాలా బెనిఫిట్ అంటూ అతని ఆటతీరుపై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల నామినేషన్ ప్రక్రియ లో ఒకరిని సేవ్ చేసే క్రమంలో… సోహెల్ కి మరియు అఖిల్ కి మధ్య గొడవ జరిగినట్లు ప్రోమోలో స్పష్టం గా కనబడుతోంది.
ఏకంగా కొట్టుకునే దాకా వెళ్ళిపోయారు ఇద్దరు. ఇదిలా ఉండగా తాజాగా రిలీజ్ అయిన మరో ప్రోమోలో అఖిల్ వంట గదిలో కూర్చుని గట్టి గట్టి డైలాగులు వేస్తున్న సోహెల్ తో…అరిచే కుక్క మొరగదు అంటూ అఖిల్ చాలా కామెడీ చేయడం ప్రోమో లో హైలెట్ గా మారింది. ఈ డైలాగుని సోహెల్ ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని రీతిలో ఫేస్ పెట్టడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది.