బిగ్ బాస్ 4 హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు వారలుగా కొనసాగుతున్న ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయ్. ఇక మొదటి వారం క్యాప్టెన్ గా లాస్య నిలవగా.. రెండో వారం కెప్టెన్ గా నోయెల్ సిన్ నిలిచాడు. రెండు వారాలు పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కెప్టెన్సీ అయినప్పటికీ మూడో వారం నుంచి టాస్కులు ఇస్తూ కెప్టెన్స్ చేస్తున్నాడు బిగ్ బాస్.
ఇక మూడో వారం ఉక్కు మనిషి టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ లో అబీజీత్ ఎంతో తెలివిగా కూల్ గా ఆట అడగా టీమ్ మెంబెర్స్ అంత కలిసి గంగవ్వకు సపోర్ట్ చేసి ఆమెను కెప్టెన్ గా చేశారు. ఇక నాలుగో వారం కాయిన్స్ టాస్క్ పెట్టగా అందులో అయోమయం జగన్నాథం అయినా కుమార్ సాయి కెప్టెన్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఎవరు ఊహించని వ్యక్తి.. ఆవేశంతో ఊగిపోయే వ్యక్తి సోహెల్ కెప్టెన్ అయ్యాడు.
ఏంటి అని ఆశ్చర్యం వేస్తుందా.. అవునండీ.. ఈ వారం బిబి హోటల్ అని టాస్క్ పెట్టగా అది కాస్త అట్టర్ ప్లాప్ అయ్యింది. గత మూడు సీజన్ల కంటే దారుణంగా ఈ సీజన్ బిబి టాస్కు అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇక ఈ టాస్కులో రెచ్చిపోయిన సోహెల్.. మెహబూబ్ అతనికి ఛాన్స్ ఇవ్వాలని అడిగి మరి ఛాన్స్ తీసుకొని కెప్టేన్ టాస్కులో పోటీ చేసి విజయం సాధించాడు.