అనారోగ్యానికి గురైన మోనాల్.. చేతికి క్యాన్వాలా!

Share

స్టార్ మా లో ప్రసారం అవుతున్న బిగ్ బోస్ సీజన్ 4 5 వారలు పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో నుంచి ఇప్పటికే సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, స్వాతి దీక్షిత్, దేవి, జోర్దార్ సుజాతలు ఎలిమినేట్ అవ్వగా గంగవ్వ అనారోగ్య సమస్యల కారణంగా బయటకు వచ్చేసింది.

ఇక అలాంటి ఈ షోలో ప్రతివారం నామినేషన్స్ జరిగే విషయం తెలిసిందే. నామినేషన్స్ జరిగిన సమయంలో ఒక్కో కంటెస్టెంట్ ఎలా తిట్టుకుంటారో.. ఎలా నిందించుకుంటారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఈరోజు నామినేషన్స్ డే. ఇక ఎవరినైతే ఎలిమినేట్ చెయ్యాలనుకుంటారో వారు మిరపకాయ దండాలు వెయ్యాలి.

ఇక అలానే ఈరోజు ప్రోమో ప్రకారం ఎక్కువగా మెహబూబ్ ని టార్గెట్ చెయ్యగా అందులో మోనాల్ గజ్జర్ కి కూడా మిరపకాయ దండాలు పడ్డాయి. అయితే అలా మిర్చి దండాలు వెయ్యగా అందులో మోనాల్ చేతికి కాన్వాలా కనిపించింది. ఇంజెక్షన్స్ ఎక్కువ వేయాల్సిన సమయంలో కాన్వాలా పెడుతారు. అలాంటిది మోనాల్ చేతికి కనిపించడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు.

ఏంటి మోనాల్ గజ్జర్ కి ఆరోగ్యం బాగోలేదా.. ఏమైంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో మోనాల్ గజ్జర్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయ్. మరి మోనాల్ గజ్జర్ కి ఏమైంది? నిజంగానే ఆరోగ్యం బాగోలేదా? అని తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.


Share

Related posts

Jathi Ratnalu review : ‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ

siddhu

ప్రముఖ నిర్మాతకు కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక

Muraliak

“స్టార్ మా” నుండి అదిరిపోయే ఛాన్స్ అందుకున్న మోనాల్..!!

sekhar